MP Bandi Sanjay Election Campaign: రైతు సంక్షేమం నిరంరం పాటుపడే సర్కార్ నరేంద్రమోదీదేనని బీజేపీ ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఇన్ పుట్ సబ్సిడీ సహా సబ్సిడీలన్నీ బంద్ చేసి కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రశ్నిస్తుంటే.. అడ్డుకుంటూ తనను బదనాం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి తన జీవితాన్నే ధారపోశానని, 74 కేసులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజల రాత మారాలంటే బీజేపీకే ఓటేసి గెలిపించాలని కోరారు. ఈరోజు ఖాజీపూర్, నాగుల మల్యాలలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తో కలిసి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు.
"రైతన్నలారా.. మోదీ ప్రభుత్వం యూరియా పేరుతో రెండు పంటలకు కలిసి ఏటా రూ.12 వేలతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ.18 వేలు చెల్లిస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ.6 వేలు బ్యాంకులో జమ చేస్తోంది. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ.24 వేలు సాయం చేస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతు బంధు పేరుతో రూ.10 వేలు మాత్రమే సాయం చేస్తోంది. మరి ఎవరు గొప్ప..? ఆలోచించండి.
బీజేపీ అధికారంలోకి వస్తే వరికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3100 చెల్లిస్తాం. అట్లాగే మహిళలకు కట్టెల పొయ్యి బాధలు తప్పించేందుకు ఉచితంగా ఉజ్వల సిలిండర్లు ఇచ్చాం. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేస్తున్నరో ప్రజలకు వివరించి ఓట్లడగాలి. కానీ గంగుల కమలాకర్ అధికారంలోకి ఉండి ఏమీ చేయలేక.. నన్ను తిట్టడం, నాపై అవినీతి ఆరోపణలు చేయడమే పనిగా పట్టుకున్నారు.. నేను అమ్మవారి భక్తుడిని. నేను అబద్దాలాడను. నేను కేంద్రం నుంచి కరీంనగర్ అభివృద్దికి నిధులు తెస్తే కొబ్బరికాయలు కొట్టి తానే తెచ్చినట్లు గంగుల తన ఫొటోలు పెట్టుకుని ఫోజులు కొడుతున్నడు..
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల చరిత్రను ఒక్కసారి బేరీజు వేయండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర. వాళ్లపై ఉన్న కేసులన్నీ కబ్జాలు, ఫోర్జరీలు, అక్రమ సంపాదన, ఐటీ కేసులే.. ఎన్నికలైపోగానే వాళ్లద్దరూ ఒక్కటై రాజీ చేసుకుంటారు.. మరి నేను ప్రజల కోసం పోరాడితే నాపై 74 కేసులు పెట్టారు. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆ కేసులపై కోర్టుల్లో నేను కొట్లాడాల్సిందే.. మరి ఎవరి కోసం నేను అన్ని కేసులు భరిస్తున్నానో ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా.. నేను ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో లేకుండా అవినీతి ఎట్లా సాధ్యం..? నేను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే అవన్నీ ప్రజలకు రాసిస్తా.. ప్రవాస భారతీయులారా.. మీ పక్షాన పోరాడుతున్నదెవరో ఆలోచించండి. కరీంనగర్ నివసిస్తున్న మీ కుటుంబ సభ్యులందరినీ పువ్వు గుర్తుపై ఓటేయించాలని కోరుతున్నా.." అని బండి సంజయ్ కోరారు.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి