KTR Vs Bandi Sanjay: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ కెక్కిన కేటీఆర్, బండి సంజయ్..

KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి  బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 23, 2024, 01:14 PM IST
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ కెక్కిన కేటీఆర్, బండి సంజయ్..

KTR Vs Bandi Sanjay:  తెలంగాణ రాజకీయాలు ఇపుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్నాయి. అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్  పై పొలిటికల్ పై చేయి సాధించేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ..బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై తన పార్టీపై చేసిన నిరాధార ఆరోపణలకు ఒక వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్..బండి సంజయ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 19న బండి సంజయ్.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు కేటీఆర్. అంతేకాదు తాను డ్రగ్స్ బానిస అయినట్టు.. అధికారంలో ఉన్నపుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన పరువు , ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్నాయని తన నోటీసులో పేర్కొన్నారు. బాధ్యతయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ చేసే వ్యాఖ్యలను ప్రజలు సీరియస్ గా తీసుకునే అవకాశాలున్నాయి. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా .. బురద చల్లే ప్రయత్నంలో భాగంగా.. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ తన నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలి తన నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే పరువు నష్టంతో క్రిమినల్ ప్రోసీడింగ్స్ ను ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఆకు వక్కతో నువ్వొకటంటే.. పోక చెక్కతో నే రెండు అంటాను అన్న రీతిలో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు  బండి సంజయ్ అదే రీతిలో బదులిచ్చారు.  కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు బెదరేది లేదన్నారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కొలేక .. నోటీసులా అంటూ బండి సంజయ్ కేటీఆర్ తీరుపై  మండిపడ్డారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

కేటీఆర్ ముందుగా నాపై  వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించారు.  అందుకు బదులుగానే మాటకు మాటగా సమాధానం చెప్పాను.  నువ్వో సుద్దపూస అనుకుంటున్నాడేమో.  కేటీఆర్ భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో తెలంగాణలో ఏం జరిగిందో ఇక్కడ ప్రజలకు తెలుసు. ఆ కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా డైల్యూట్ చేసిందో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే సమాధానం ఇచ్చిన. ఇపుడు కేటీఆర్ లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాము అంటూ జై శ్రీరామ్.. భారత్ మాతాకీ జై అంటూ కేటీఆర్ లీగల్ నోటీసుకు అంతే ఘాటుగా బండి సమాధానం ఇచ్చారు. మొత్తంగా తెలంగాణలో లీగల్ నోటీసులతో పొలిటికల్ హీట్ పెరిగిందనే చెప్పాలి.  

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News