Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో ఎప్పుడు ఎవరూ ఆ పార్టీలో చేరుతారనే తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతుండటంతో వలసలు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం సాగుతోంది. వలస నేతల్లో చాలా కాలం నుంచి వినిపిస్తున్న పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం మాజీ ఎంపీ అయిన పొంగులేటి ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ఇటీవల పొంగులేటి కూతురు వివాహం అదరహో అన్నట్లుగా సాగింది. మ్యారేజీ వేడుకలో బీజేపీ నేతల సందడి కనిపించిగా.. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. పెళ్లిళ్లకు హాజరుకావడంలో ముందుండే కేసీఆర్.. పొంగిలేటి ఇంటి వేడుకకు రాకపోవడం చర్చగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి టచ్ లోకి వెళ్లడం వల్లే కేసీఆర్ సహా టీఆర్ఎస్ కీలక నేతలు వివాహ వేడుకకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపించాయి.
పొంగులేటి పార్టీ మారడానికి ముహుర్తం సిద్దమవుతుందనే తరుణంలో తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో జరిగిన ఓప్రైవేటు కార్యక్రమానికి హాజరైన పొంగులేటి.. రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎవరూ తొందరపడొద్దని తన అనుచరులు, అభిమానులకు సూచించారు. త్వరలో దేవుడే మనకు మంచి మార్గం చూపిస్తారంటూ వ్యాఖ్యానించారు. ‘ఇంకేంటి శీనన్న.. ఇంకేంటి శీనన్న అనే ఉత్కంఠ ఎవరికీ వద్దు. మీ వెంట ఉండేవారిలో అదే ఉత్కంఠ తేవొద్దు. కాలం, సందర్భం అన్నీ భగవంతుడే నిర్ణయిస్తారని" పొంగులేటి చెప్పారు. త్వరలోనే మంచి ఫలితం వస్తుందని, తనను నమ్ముకున్న అందరికీ అందులో వాటా ఉంటుందని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
పొంగులేటి చేసిన తాజా వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారాయి. పార్టీ మారడానికే డిసైడ్ అయ్యారా లేక టీఆర్ఎస్ అధిష్టానం నుంచి తనకు ఏమైనా హామీ వస్తుందని అలా అన్నారా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయాలనే యోచనలో పొంగులేటి ఉన్నారని అంటున్నారు. కొత్తగూడెం టికెట్ విషయంలో కేటీఆర్ హామీ ఇచ్చారని కూడా ఆయన అనుచరులు కొన్ని రోజుల క్రితం ప్రచారం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమవుతున్నారనే ప్రచారం వస్తోంది. మొత్తంగా తన రాజకీయ భవిష్యత్ కు సంబంధించి త్వరలోనే పొంగులేటి కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
Read Also: Bengaluru Traffic: బెంగళూరు ఐటీ సంస్ఠలకు ట్రాఫిక్ గండం.. ఒక్క రోజే 225 కోట్ల నష్టం
Read Also: Indian Railways Update: నేడు 255 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే! వివరాలు ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి