Summer in Telangana: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. గత మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఉదయం తొమ్మిది దాటితే చాలు జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం పూర్తిగా రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారి, కర్ఫూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారులు ఎండమావులను తలపిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో కూడా పూర్తిగా చెట్టు కొమ్మలు ఎండిపోయి, రాలిపోయాయి. వడగాలుల తీవ్రతను జనం ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయాల్లో బస్సు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఎండ సమయంలో తప్పని పరిస్థితులలో మాత్రమే జనం బయటకు వస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
మార్చి నెలలోనే ఎండలు మండిపోతే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొంత ప్రాంతం సింగరేణి ఏరియా కావడంతో ఎండవేడి అధికంగా ఉంది. ఇళ్లలో ఉన్నప్పటికీ.. కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూలర్ లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also read: Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook