Hyderabad Metro: పట్టాలెక్కనున్న హైదరాబాద్ మెట్రో..

రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాయాణించే

Last Updated : May 23, 2020, 09:30 PM IST
Hyderabad Metro: పట్టాలెక్కనున్న హైదరాబాద్ మెట్రో..

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాయాణించే (Hyderabad Metro Rail) హైదరాబాద్ మెట్రోరైల్ మార్చి 22న ఆగిపోయింది. గత రెండు నెలలుగా మెట్రోస్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. తెలంగాణ సర్కారు విధించిన నిబంధనలకు తాము సహకరిస్తామని మెట్రో ప్రకటించి రైల్ సేవలను నిలిపివేశారు. కాగా ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇస్తూ అరెంజ్, గ్రీన్ జోన్లలో (Orange, Green zones) పూర్తి స్దాయిలో కార్యకలపాలు చేసుకోవచ్చని ప్రకటన చేయడంతో గ్రేటర్ మినహా మిగతా జిల్లాలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు పున: ప్రారంభమయ్యాయి. ఇటు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మధ్యం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ప్రారంభం కావడంతో పనిచేసే ఉద్యోగులకు రవాణా ఇబ్బందులు రావడంతో జూన్ 1 నుండి బస్సులతో పాటు మెట్రో రైల్‌ను ప్రారంభించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమైతున్నట్లు వెల్లడించారు. 

Also Read: Telagana: ప్రవేశ పరీక్షల తేదీల విడుదల..

మరోవైపు లాక్ డౌన్ కు ముందే అప్పుడప్పుడే ఆదాయమపరంగా కుదుటపడుతున్న సమయంలో కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చడంతో మెట్రో ఆశలపై నీరుగారాయి. మూడు కారిడార్ల పరిధిలో 10నిమిషాలకు ఒక సర్వీసు నడుపుతూ రోజుకు రూ. కోటి ఆదాయం, మెట్రో మాల్స్ ద్వారా నెలకు రూ.10కోట్లు లాభాల బాటలో ఉండేదన్నారు.  ప్రయాణికులు నిలబడకుండా, వారు సూచించిన సీట్లలో కూర్చునే విధంగా ఏర్పాటు చేయనున్నారని, ఏసీలను సగం వరకు తగ్గించి ప్రకృతి ప్రసాదించే గాలిని పీల్చుకునే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. బోగీలను శానిటైజ్ చేసి ప్రయాణికులు రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేసి ముఖానికి మాస్కులు ధరించేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News