హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యం

'కరోనా వైరస్' ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో  లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో జనం గడప దాటకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి.

Last Updated : Apr 7, 2020, 03:23 PM IST
హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యం

'కరోనా వైరస్' ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో  లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో జనం గడప దాటకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. 

తెలంగాణలోనూ లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు.  దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు.. ఇప్పుడు ఖాళీగా  కనిపిస్తున్నాయి. పండగల సమయాల్లో పట్నం నుంచి ఊళ్లకు జనం వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో .. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లు అలాగే ఉన్నాయి. ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లను మీరూ చూడండి..

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News