BRS Harish Rao Meeting: సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బరి గీసి చింతా ప్రభాకర్‌ను గెలిపించుకుంటామని.. గెలిపించుకున్నారని చెప్పారు. ప్రతీ కార్యకర్త తానే అభ్యర్థిననుకుని పని చేశారని.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించామన్నారు. కొన్ని స్థానాలు స్వల్ప మెజారిటీతో కోల్పోయామని.. దురదృష్టశావత్తు మనం అధికారం కోల్పోయామని అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు హరీశ్ రావు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ఒడిదొడుకులు కొత్త కాదని అన్నారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్ధి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడన్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోతామని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని.. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని అన్నారు. దుష్ప్రచారం కూడా కొంత పై చేయి సాధించిందన్నారు.
కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని.. బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేనని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్.. గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దామని.. వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు సూచించారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని.. మనం ధైర్యం కోల్పోవద్దని హితవు పలికారు. ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదన్న హరీశ్ రావు.. భవిష్యత్ మనదేనన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని.. కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితమన్నారు.
Also Read: Luck Signs: అదృష్టం వరించే ముందు కనిపించే సంకేతాలు.. అస్సలు అశ్రద్ధ చేయకండి
Also Read: Police Officer Sucess Story: పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..తెల్లచెందనం పంటతో కోట్లకు కోట్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి