Covid-19 cases: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) ఆదివారం ఉదయం వెల్లడించింది. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణ ( Telangana ) లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,495కు పెరిగింది. ఇప్పటివరకు 627మంది మరణించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,869 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటి వరకు 55,999 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read: Covid-19: మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెహెచ్‌ఎంసీ పరిధిలో 463 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్ జిల్లాలో 141, రంగారెడ్డి జిల్లాలో 139, కరీంనగర్ జిల్లాలో 96, జోగులాంబ గద్వాల జిల్లాలో 93, జనగామ జిల్లాలో 78, పెద్దపల్లి జిల్లాలో 71, వరంగల్ రూరల్ జిల్లాలో 71 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. Also read: Mahesh Babu: టాలీవుడ్ యువరాజుకు హ్యాపీ బర్త్ డే
Telangana: కొత్తగా 1,982 కరోనా కేసులు.. 12మంది మృతి