Telangana Covid-19 updates: హైదరాబాద్: రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం ఆగస్టు 24) కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) తెలిపింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా సోమవారం 9మంది మరణించినట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,08,670కి చేరుకోగా.. మరణాలు 770కి పెరిగాయి. Also read: Building Collapsed : ఇద్దరు మృతి.. చాలామంది శిథిలాల కిందనే..!
తెలంగాణలో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 84,163 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం 52,933 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు ప్రభుత్వం (TS Govt) వెల్లడించింది. గత 24గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 295 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..
Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..