Brs Mlas Vs Malla Reddy: సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. ఐదుగురు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డిపై ఇటీవల ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీలు సమావేశం నిర్వహించారు. తమ నియోజకవర్గ విషయాల్లో మల్లారెడ్డి జోక్యం చేసుకుంటున్నారని బహిరంగంగానే చెప్పారు. ఎమ్మెల్యేలను కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని మల్లారెడ్డి కూడా సమాధానం ఇచ్చారు.
అయితే మరోసారి ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతిలో ఎమ్మెల్యేలు మైనంపల్లి, మాధవరం, వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. గురువారం వీరంతా కలిసే తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం.. అక్కడే సమావేశమైనట్లు తెలిసింది. మంత్రి మల్లారెడ్డి విషయంపై వీరు చర్చించినట్లు సమాచారం.
ఇటీవల ఈ ఎమ్మెల్యేల సమావేశంతో బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాత్రికి రాత్రే మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను మార్చడంపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ పదవుల్లో తమ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు.
'మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. పదవులన్నీ ఒకే నియోజకవర్గానికి వెళుతున్నాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లిపోతున్నారు. మంత్రి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు. నామినేటెడ్ పదవులు మా నియోజకవర్గాల కార్యకర్తలకు రావడం లేదు. పదవులన్నీ ఆయన అనుచరులకే ఇప్పించుకుంటున్నారు..' అని ఎమ్మెల్యేలు మాధవరం, అరికెపూడి అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి కూడా స్పందిస్తూ.. ఇది కుటుంబ సమస్య అని చెప్పారు. అందరం అన్నదమ్ముల్లా ఉంటున్నామని.. సమస్యను పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఏమైనా ఉంటే సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతామన్నారు. అవసరమైతే తాను ఆ ఎమ్మెల్యేల ఇంటికి వెళతాని.. లేదంటే వారినే తన ఇంటికి పిలిపించి మాట్లాడతానని మల్లారెడ్డి తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఇప్పటివరకు రియాక్షన్ రాలేదు.
Also Read: MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?
Also Read: ప్రాధాన్యత లేదని ప్రమోషన్స్ కు దూరమా.. నయనతార లాజిక్ ఇలా మిస్ అయిందేంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook