Bridegroom dies of heart attack : పెళ్లి ఊరేగింపులోనే వరుడు మృతి!!

పెళ్లి చేసుకున్నాననే ఆనందంలో బరాత్‌లో స్నేహితులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేసిన వరుడు గణేష్.. ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కానీ బంధువులు, స్నేహితులు హుటాహుటిన గణేష్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Feb 15, 2020, 07:10 PM IST
Bridegroom dies of heart attack : పెళ్లి ఊరేగింపులోనే వరుడు మృతి!!

నిజామాబాద్ : పెళ్లి బాజాలు మోగిన ఇంట అదే రోజున మృత్యువు తాండవం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్నాననే ఆనందంలో బరాత్‌లో నవ వధువు స్వప్నతో పాటు స్నేహితులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేసిన వరుడు గణేష్.. ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కానీ బంధువులు, స్నేహితులు హుటాహుటిన గణేష్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అప్పటివరకు పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకున్న ఆ రెండు కుటుంబాలు, వారి బంధుమిత్రులు గణేష్ మృతితో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. బోధన్‌లోని బ్రాహ్మణగల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

బోధన్‌కి చెందిన గణేష్‌కి అక్కడికి సమీపంలోని సాలూరు గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం ఘనంగా ఊరేగింపు చేపట్టారు. వరుడు గణేష్ తన స్నేహితులతో కలిసి బరాత్‌లో పాల్గొన్నాడు. వధువు స్వప్నతో కలిసి కాసేపు సరదాగా స్టెప్పులు కలిపాడు. కానీ ఇంతలోనే గణేష్ గుండెపోటుతో మృతి చెందడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News