Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!

Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..  తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు రేవంత్ ను ఏకంగా ధర్మం తెలిసిన వ్యక్తిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 18, 2024, 08:05 AM IST
Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!

Raja Singh Vs Revanth Reddy: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డిని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు గణేష్ నిమజ్జనోత్సవాన్ని రేవంత్ దగ్గర ఉండి చేసిన ఏర్పాట్ల తీరుపై ప్రశంసలు కురిపించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా  పోలీసులు, మున్సిపల్ సహా అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరు బాగుందంటూ మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ధర్మం తెలిసిన వాడే కాబట్టి.. గణేష్ పూజా మహోత్సవాల నుంచి నిమజ్జనోత్సవాల వరకు అన్ని పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారని కితాబు ఇచ్చారు. గతంలో ఏ సీఎం కూడా ఖైరతా బాద్ గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్ల తీరును ఈ రకంగా పర్యవేక్షించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందు ఉండి నడిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

ఎపుడు ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గణేష్ నిమజ్జనం సందర్భంగా రాజా సింగ్. .రేవంత్ రెడ్డి పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా హైడ్రా బుల్‌డోజర్లు .. ఎంఐఎం అధినేతల కాలేజీలపైనే ఎందుకు వెళ్లలేదనే విషయమై రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు రాజా సింగ్. కేవలం రాజకీయ లబ్డి కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాతో హై డ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే కదా. ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా ప్రవర్తించిన తీరుపై హై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.

మరోవైపు రాజా సింగ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఆర్ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. మరోవైపు వీరిద్దరు తెలుగు దేశం పార్టీలో కొన్నేళ్లు పనిచేసారు. అటు టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇంకోవైపు రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News