Balkonda Constituency: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత కరువైంది. ఒకప్పుడు జిల్లాలో అన్ని తానై వ్యవహారించిన మాజీమంత్రి వేముల ప్రశాంత్‌కు అధికార పార్టీ నేతలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలను అధికార పార్టీ నేతలు లాగేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే భీంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ లీడర్‌ను తమవైపు తిప్పుకున్న అధికార పార్టీ ఇప్పుడు ఆయనకు ఏకంగా డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలు మండలాల్లో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్లను లాగే పనిలో అధికార పార్టీ నిమగ్నమైనట్టు టాక్ వినిపిస్తోంది..
Also Read:
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండుచోట్ల విజయం సాధించింది. బాన్సువాడలో మాజీమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందగా.. బాల్కొండలో వేముల ప్రశాంత్ విజయం సాధించారు. బాల్కొండలో కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌నేత సునీల్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. కానీ వేముల మాత్రం అధికార పార్టీపై ఒంటరి పోరాటం చేస్తూ.. క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని మాజీమంత్రి వేములకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గతంలో తాము అధికారంలో ఉండగా.. చేరికలకు తెరతీసిన వేములకు.. ఇప్పుడు రివర్స్ పంచ్ తగులుతోందట. గులాబీ పార్టీకి చెందిన కీలక లీడర్లు కారు దిగుతూ వేములకు వరుస షాక్‌లు ఇస్తున్నట్టు టాక్.
ఇటీవల భీంగల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి వేముల ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ కీలక నేత రమేష్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ నేత సునీల్‌రెడ్డి తెరవెనుక పావులు కదపడటంతో హాస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రమేష్‌రెడ్డి పార్టీలో చేరగానే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరోవైపు ఇతర మండలాల్లో కూడా బీఆర్ఎస్ ఎంపీపీలు, జడ్పీటీలకు గాలం వేసే పనిలో సునీల్ రెడ్డి ఉన్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే భీంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. గులాబీ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు హస్తం కండువా కప్పేసింది. మిగతా చోట్ల కూడా కారు పార్టీ లీడర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ నేత సునీల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అయితే సునీల్ రెడ్డి నేరుగా కొద్దిమంది లీడర్లకు టచ్‌లోకి వెళ్తుండటంతో మరికొందరు లీడర్లు కూడా అధికార పార్టీలో చేరేందుకు తెగ అసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది..
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ రెడ్డి దెబ్బకు బాల్కొండలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో మరికొందరు లీడర్లు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ దూకుడు రాజకీయంతో మాజీమంత్రి వేముల కంటిమీద నిద్ర కరువైందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Jio New Recharge Plan: జియో నుంచి మరో పవర్ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ 2జీబీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.