Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల పిల్లల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి మనవడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కావాలనే వాళ్లను కాపాడుతున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించటం ఉద్రిక్తతకు దారితీసింది. అటు కాంగ్రెస్ నేతలు ఏకంగా హోంశాఖ మంత్రి ఇంటి దగ్గరే ఆందోళనకు ప్రయత్నించారు. గ్యాంగ్ రేప్ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నారనే ప్రచారంతో ఈ ఘటన రాజకీయ రచ్చగా మారింది.
జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్‌కు వెళ్లిన యువతిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో బాలికను తీసుకెళ్లిన యువకులు.. అందులోనే గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత బాలికను పబ్ దగ్గర వదిలేసి వెళ్లారు. మే28న ఈ ఘటన జరగగా.. మే31న పోలీసులకు ఫిర్యాదు అందింది. జూన్ 2న కేసు వివరాలు బయటికి వచ్చాయి. పెద్దల పిల్లలు ఉన్నందునే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త అనంద్ మహీంద్రా స్పందించారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించే ఆనంద్ మహీంద్రా.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపైనా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ... " వాళ్లు పెట్టిన హెడ్డింగ్ సరైందని కాదని నా అభిప్రాయం.. ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1
— anand mahindra (@anandmahindra) June 3, 2022
మరోవైపు కేసు వివరాలు తెలిపిన వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్.. ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మిగిలిన నిందితులను 48 గంటల్లోగా పట్టుకుంటామని చెప్పారు. తాము అరెస్ట్ చేసిన వారిలో వ క్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కొడుకు ఖాదర్‌ఖాన్, అతని ఫ్రెండ్ హాదీ ఉన్నారని తెలిపారు. హోం శాఖ మంత్రి మనవడు ఉన్నారనే వార్తల్లో నిజం లేదన్నారు డీసీపీ జోయల్ డేవిస్.
READ ALSO: MLC Anantha Babu: జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు...?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook