Oppo F23 5G Launch: ఒప్పో నుంచి బలమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. 18 నిమిషాల్లోనే ఛార్జింగ్‌! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Oppo F23 5G Smartphone Launch: Oppo Released Oppo F23 5G in India, Oppo F23 5G Price, Battery and Specifications. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ 'ఒప్పో ఎఫ్‌23' (Oppo F23 5G).   

Written by - P Sampath Kumar | Last Updated : May 16, 2023, 06:44 PM IST
Oppo F23 5G Launch: ఒప్పో నుంచి బలమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. 18 నిమిషాల్లోనే ఛార్జింగ్‌! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Oppo F23 5G Smartphone Launched in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం 'ఒప్పో'కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ 'ఒప్పో ఎఫ్‌23' (Oppo F23 5G). ఈ ఫోన్ రెడీమీ నోట్ 12 ప్రోతో పోటీపడుతుంది. ఒప్పో కంపెనీ యొక్క F-సిరీస్ ఫోన్స్ సరసమైన ధరలలో శక్తివంతమైన కెమెరాలకు ప్రసిద్ధి. అయితే ఈసారి కంపెనీ బలమైన బ్యాటరీని కూడా అందించింది. ఒప్పో ఎఫ్‌23 5G ధర మరియు ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం. 

Oppo F23 5G Price:
ఒప్పో ఎఫ్‌23 5G ఫోన్ మే 18 నుంచి రెండు రంగు (బోల్డ్ గోల్డ్ మరియు కూల్ బ్లాక్) ఎంపికలలో అందుబాటులో ఉంటుంది: ఒప్పో ఇండియా స్టోర్, అమెజాన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా 8GB RAM మరియు 256 GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌ను రూ. 24,999కి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్‌పై  బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 4,167ల నో-కాస్ట్ EMI  కస్టమర్‌లకు అందుబాటులో ఉంది.

Oppo F23 5G Camera:
ఒప్పో ఎఫ్‌23 5G ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. వెనుక భాగంలో రెండు అదనపు 2-మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు ప్యానెల్‌లో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వినియోగదారులు పోర్ట్రెయిట్ మోడ్, AI పోర్ట్రెయిట్ రీటౌచింగ్, సెల్ఫీ HDR మరియు AI కలర్ పోర్ట్రెయిట్ వంటి ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

Oppo F23 5G Battery:
ఒప్పో ఎఫ్‌23 5G ఫోన్ క్వాల్‌కామ్‌ యొక్క స్నాప్‌డ్రాగన్ 695 SoCని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 67W SuperVOOC ఫ్లాష్ ఛార్జింగ్ కారణంగా ఇది కేవలం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ని అందిస్తుంది. ఈ ఫోన్ కాల్‌ మాట్లాడితే 39 గంటలు, YouTube వీడియోలను చూస్తున్నప్పుడు 16 గంటల వరకు ఛార్జింగ్ ఉంటుంది. 

Oppo F23 5G Specifications:
ఒప్పో ఎఫ్‌23 5G 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అయినా కూడా ఈ ఫోన్ సన్నగా ఉంటుంది. పూర్తి-HD+ రిజల్యూషన్‌తో LCD డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. వివిడ్ మోడ్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 96 శాతం కలర్ గ్యామట్‌ను అందిస్తోంది. రిజొల్యూషన్ రేటు 2400×1080 పిక్సెల్స్ విత్ 580 నిట్స్ బ్రైట్‌నెస్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5జీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ ఫర్ చార్జింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.

Also Read: Priyanka Sharma Hot Pics: ఫ్రంట్ సూపర్, బ్యాక్ బంపర్.. వైరల్ అవుతోన్న ప్రియాంక శర్మ హాట్ ఫొటోస్!  

Also Read: Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News