OnePlus 13: రూ.72,999 OnePlus 13 మొబైల్‌పై రూ.52 వేల డిస్కౌంట్‌.. మాములు ఆఫర్‌ కాదు భయ్యా..

OnePlus 13 Price: అత్యంత తక్కువ ధరలోనే వన్ ప్లస్ 13 (OnePlus 13) సిరీస్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ను ఇప్పుడే కొనుగోలు చేసే వారికి రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 14, 2025, 02:07 PM IST
OnePlus 13: రూ.72,999 OnePlus 13 మొబైల్‌పై రూ.52 వేల డిస్కౌంట్‌.. మాములు ఆఫర్‌ కాదు భయ్యా..

OnePlus 13 Price: వన్ ప్లస్ మొబైల్ కొనడమే మీ డ్రీమా.. అయితే మీకోసం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ని పరిచయం చేయబోతున్నాం.. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.5000 నుంచి రూ.6000 వరకు తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా రిపబ్లిక్ డే సేల్లో భాగంగా ఈరోజే వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రత్యేకమైన సంక్రాంతి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీనిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

వన్ ప్లస్ 13 (OnePlus 13) స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుంది. ఇది అద్భుతమైన స్టైలిష్ డిజైన్స్‌తో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని 256 జీబీ వేరియంట్ పై ప్రత్యేకమైన రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ మొబైల్ ధర MRP రూ.72,999 కాగా.. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా నాలుగు శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్ పోనూ కేవలం రూ.69, 999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

ఇక ఈ వన్ ప్లస్ 13 మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలులోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో అమెజాన్‌కు సంబంధించిన కొన్ని అనుసంధాన బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డులు వినియోగించి పేమెంట్ చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.5,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తిగా పోనూ..64,749 కే ఈ మొబైల్ పొందవచ్చు. 

అలాగే దీనిపై అదనంగా నో కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేసే వారికి.. నో కాస్ట్ EMI కూడా లభిస్తుంది. అలాగే పాత మొబైల్స్‌ని ఎక్స్చేంజ్ చేస్తే ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్‌పై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుంటే దాదాపు రూ.52,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను ఈ వన్ ప్లస్ 13 మొబైల్ రూ.12,749 కే పొందవచ్చు.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News