Oneplus 13 Price: వన్‌ప్లస్‌ నుంచి బిగ్‌ సర్పైజ్‌.. చీప్‌ ధరకే 1TB స్టోరేజ్‌ OnePlus 13 రాబోతోంది.. ఇక దీనికి తిరుగులేదు!

OnePlus 13 Price: అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి OnePlus 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటిని కంపెనీ మొదట చైనాలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ మొబైల్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 1, 2024, 12:02 PM IST
Oneplus 13 Price: వన్‌ప్లస్‌ నుంచి బిగ్‌ సర్పైజ్‌.. చీప్‌ ధరకే 1TB స్టోరేజ్‌ OnePlus 13 రాబోతోంది.. ఇక దీనికి తిరుగులేదు!

OnePlus 13 Price And Launch Date: ప్రముఖ చైనీస్ టెక్‌ కంపెనీ వన్‌ప్లస్‌ (OnePlus) మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న OnePlus 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విడుద కాబోతున్నాయి. అయితే కంపెనీ అధికారిక ప్రకటనకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కంపెనీ ముందుగా చైనాలో విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన 6000mAh బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ప్రీమియం IP69 ప్రొటెక్షన్ రేటింగ్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా బోలెడు అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

మొదట ఈ OnePlus 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌ సిరీస్‌లో OnePlus 13 డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ ఇందులో జంబో బ్యాటరీకి సరిపడ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 24GB ర్యామ్‌, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో విడుదల కాబోతోంది. 

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్స్‌ వివరాలు:
ఈ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వివరాల్లోకి వెళితే.. కంపెనీ దీనిని అద్భుతమైన OLED డిస్‌ప్లేతో లాంచ్‌ చేయబోతోంది. దీని డిస్ల్పే ఫ్యానెల్‌ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 4500నిట్స్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌లో కంపెనీ మొదటి సారిగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను తీసుకు రాబోతోంది. ఈ మొబైల్‌ సిరీస్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌పై రన్‌ కాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన ఎన్నో ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

Also Read: 200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

ఇక ఈ సిరీస్ బ్యాక్‌ సెటప్‌లో Hasselblad బ్రాండింగ్‌ని కలిగి ఉంటుంది. దీని బ్రాండింగ్‌తోనే ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఇందులోని ప్రధాన కెమెరా 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ అదనంగా 50MP టెలిఫోటో సెన్సార్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ కెమెరాలన్నింటికీ OIS సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మరో 50MP సోనీ సెన్సార్‌ కూడా లభించనుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫంట్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే.. సెల్ఫీ కోసం కంపెనీ ఇందులో 32MP ఫ్రంట్‌ కెమెరాను అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేస్తే మొదటి వేరియంట్‌ రూ. 53,100తో లభించనుంది. 

Also Read: 200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News