విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు.
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
Vizag gas leak tragedy విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకేజ్ ( Chemical gas leakage ) అయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. విషవాయువు చుట్టుముట్టడంతో ఊపిరాడక వందల మంది జనం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.