NITI Aayog Meet: పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్న హిమాచల్ ప్రభుత్వం.. ఎన్పీఎస్ కింద జమ చేసిన రూ.9,242.60 నిధులు వెనక్కి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సీఎం సుఖ్విందర్ సింగ్. పీఎఫ్ఆర్డీఎకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఢిల్లీలో నేడు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రాకు ప్రత్యేక హోదా దక్కకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని ఈ సమావేశంలో వివరించే ప్రయత్నం చేశారు. హోదా దక్కకపోవడం వల్ల రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను ఈ సమావేశం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు వెనక్కు వెళ్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగం 2013-14 ఆర్థిక సంవత్సరంలో 23శాతం వృద్ధి కనిపిస్తే, 2017-18లో 34 శాతంగా నమోదైందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.