తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం క్షిణిస్తోందని కావేరి ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రితోపాటు గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసం ఎదుట సైతం భారీ భద్రత ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్.
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక వెన్నెముక లేని పార్టీ అని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకారం అందించలేదని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే తొత్తుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
డీఎంకే నేత ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
తమిళనాడులోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఆందోళన చేసిన క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలగాలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ.. స్థానికులకు మద్దతు ఇస్తూ డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తమిళనాడు సెక్రటేరియట్ బయట తన అనుచరులతో కలిసి ధర్నా చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
డీఎంకే పార్టీ నేత ఎంకే స్టాలిన్ కర్ణాటకలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన బీఎస్ యెడ్యూరప్పకు అభినందనలు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఎస్ యెడ్యూరప్పను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన స్టాలిన్.. ''ఇకపై కర్ణాటకలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమైనా సుప్రీం కోర్టు తీర్పుతో విభేదించకుండా తమిళనాడుకు ఇవ్వాల్సి వున్న కావేరి జలాలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నాను'' అని అందులో విజ్ఞప్తి చేశారు.
కావేరి వివాదంతో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. కావేరి మెనేజ్మెంట్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైందని.. ఈ విషయంలో వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ డీఎంకే నేతలు మరికొన్ని ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి ఈ రోజు బంద్ ప్రకటించారు.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐడీఎంకే పార్టీ పెద్ద ఎత్తున నగదును పంపిణీ చేస్తుందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే పార్టీ కోశాధికారి ఎం.కె. స్టాలిన్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ డీఎంకే అధినేత కరుణానిధిని ఇంటికి వచ్చి పరామర్శించడం తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. మీడియా ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంపై స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. మోదీ వెళ్లిన తరువాత బుధవారం బ్లాక్ డే నిరసనల్లో పాల్గొనమంటూ, పాల్గొంటామంటూ ప్రకటనలు చేసి అయోమయానికి గురిచేశారు డీఎంకే పార్టీ. ఎట్టకేలకు పాల్గొంటామంటూ స్టాలిన్ చెప్పడంతో నిరసనల్లో పాల్గొన్నారు ఆ పార్టీ నాయకులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.