ఇటీవల వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. దీంతో అతడికి కరోనా టెస్టులలో ఏం తేలుతుందోనని భయపడ్డారు. కానీ కోవిడ్19 టెస్టులలో గేల్‌కు నెగటివ్ (Chris Gayle tests negative for COVID-19)గా వచ్చినట్లు తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 (IPL-2020) టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్‌లో జరగనుంది. కరోనా (Coronavirus) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరు నెలలపాటు ఇప్పటికే ఆలస్యమైంది. ఎలాగైనా 13వ సీజన్ టోర్నీ కప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఇప్పటికే పలు జట్లు యూఏఈ చేరుకున్నాయి.
IPL 2020 Players Dope Tests | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడనున్న స్టార్ క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ లాంటి ఆటగాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి డోప్ టెస్టులు చేస్తారు.
అన్ లక్కీ టీమ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పేరు. ఒక్క చిన్న తప్పిదం టోర్నమెంట్లో టీమ్ దశనే మార్చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్సీబీ సహచరులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli To RCB Teammates) సూచించాడు.
క్రికెట్లో బ్యాట్స్‌మేన్‌కి ఫ్రీ హిట్ ( Free hit ) ఉన్నట్టు బౌలర్లకు కూడా ఫ్రీ బాల్ రూల్ పెట్టి ఓవర్లలో కౌంట్ అవకుండా బంతిని వేసే అవకాశం ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) అభిప్రాయపడ్డాడు.
భారత్ లో కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య 30 లక్షలను దాటేసింది. రోజురోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఐపిఎల్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ అభిమానుల ఫేవరిట్ గేమ్ యూఏఈలో మళ్లీ మొదలు కానుంది. అయిత కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల రక్షణ విషయంలో ఎలాంటి రిస్కు తీసుకోవడం లేదు. వారికి ప్రత్యేక కిట్ లు అందించడంతో పాటు మరెన్నోఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి.
ఆరు నెలలు ఆలస్యమైనా మరో నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానుంది. విదేశాల్లో నిర్వహిస్తుండటంతో ఏ జట్టుకు కలిసొస్తుంది, ఏ జట్టుకు అవకాశాలున్నాయి అనే అంచనాలు మొదలయ్యాయి.
ఐపీఎల్ 2020 లోగో ( IPL 2020 new logo ) మారింది. పాత స్పాన్సర్స్ వివో ( VIVO ) స్థానంలో ప్రముఖ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 ( Dream 11 ) వచ్చి చేరడంతో పాత లోగో స్థానంలో కొత్త లోగో సైతం వచ్చేసింది.
అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఈ వారం యూఏఈకి బయలుదేరనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సైతం ప్రయాణానికి సిద్ధమైంది. అయితే సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) లేకుండానే చెన్నై టీమ్ దుబాయ్‌కి బయలుదేరనుంది.
టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్ ( IPL 2020 Sponsor Dream11)గా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికైంది.
క్రికెట్ ( Cricket ) ట్రెండ్ నే మార్చేసిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League). ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైనా టోర్నమెంట్ లలో ఒకటి ఐపిఎల్.
ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్, భారత అరుదైన క్రికెటర్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారి నుంచి (Karun Nair recoverd from COVID19) కోలుకున్నాడు. ఐపీఎల్ 2020లో కరుణ్ ఆడనున్నట్లు పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
IPL 2020 సన్నాహకాలలో భాగంగా ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఆగస్టు 15 నుంచి స్థానిక చెపాక్ స్టేడియంలో ఫిట్నెస్ క్యాంపు, ట్రైనింగ్ సెషన్ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ సెషన్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దూరం కానున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. టీమిండియా మాజీ కెప్టేన్, IPL 2020 లో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్లపాటు తమ జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు.
విరాట్ కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు. కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు (Virat Kohli To Join Rajasthan Royals) అందుకు భిన్నంగా స్పందించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ఐపీఎల్ ( IPL ) టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో..ఆ స్థానం కోసం భారతీయ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పతంజలి సంస్థ రేసులో ముందంజలో ఉంది. పతంజలి బ్రాండ్ ను విదేశాల్లో విస్తరింపజేసేందుకు ఐపీఎల్ వేదిక అవుతుందనేది సంస్థ ఆలోచనగా ఉంది.
Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.