సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు. ఇదొక్కటే కాదు క్రిస్మస్ తర్వాతి రోజున ఆరంభం అయ్యే ఏ టెస్ట్ మ్యాచును అయినా 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు.
మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. పదేళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడన్నారు.
తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై స్పందించాడు.
భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో టెస్ట్ సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు.
2018-19లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. కుల్దీప్ యాదవ్‌ను ఓవర్సీస్ నంబర్ 1 అని పేర్కొన్నాడు. దాంతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ .. నిరాశచెండాడట. అప్పుడు తనను బస్సు కింద పడేసినట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.
టీమిండియాతో సిరీసుకు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. జాత్యహంకార ఆరోపణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లను క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) విచారణకు ఆదేశించింది.
భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని భారత టెస్ట్ బ్యాటర్ చేటేశ్వర్ పుజారా అన్నాడు. భారత జట్టు ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తుందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి విదేశీ పిచ్‌లపై విజయాలు సాదించిందన్నాడు.
సుదీర్ఘమైన ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు.
రవీంద్ర జడేజా బుధవారం తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. 'లాంగ్ వే టూ గో (ఇంకా చాలా ఆడాల్సి ఉంది)' అని ఫొటోకు కాప్షన్ ఇచ్చాడు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను బీసీసీఐ అధికారి తోసిపుచ్చారు. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడా? అని అడగ్గా.. 'తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడు' అని తెలిపారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.