Revanth Reddy Kills 36 Students In Residential Schools: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని.. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు చనిపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రకటించారు.
Orphan Students Died With Food Poison: రాఖీ పండుగ రోజు ఘోర సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని నలుగురు అనాథ విద్యార్థులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Punjab Girl Dies: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బర్త్ డే వేడుకలకు గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దగ్గరలోని బేకరీ నుంచి కేక్ ఆర్డర్ పెట్టారు. బంధువులు, చిన్నారులను ఇంటికి పిలిచి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కానీ ఇంతలో జరిగిన ఘటన పంజాబ్ కుంటుంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Snake Found In Mid-Day Meal: పాట్నా: పాము పడిన మధ్యాహ్నం భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతపాలై ఆస్పత్రిలో చేరిన ఘటన ఇది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాలకు, ఆస్పత్రి వద్దకు చేరుకుని, స్కూల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్ పై సైతం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Girl Dies after eating Shawarma: 'షవర్మా' అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. తనకిష్టమైన షవర్మా తినేందుకు బేకరీకి వెళ్లిన ఓ యువతి... తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
Food Poisoning In School: విశాఖ మన్యం పాడేరు కేజీబీవీ పాఠశాలలో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది హుటాహుటిన బాధితులను పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ తెలిపారు.
Aamani's health condition news: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో ఒకరైన ఆమని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనేది ఆ వార్తల సారాంశం.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంత రాజధాని కరాచిలో దారుణం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన మీడియా సంస్థ డాన్ న్యూస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి అరిజోనా గ్రిల్ రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ముగ్గురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. అందులో ఒక వృద్ధురాలు ఉండగా మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భోజనం చేసి ఇంటికి చేరుకున్న అనంతరం ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలికి వాంతులు, విపరీతంగా కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మైనర్ బాలురు ఇద్దరు మృతిచెందగా వృద్ధురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.