'కరోనా వైరస్' భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
'కరోనా వైరస్'పై పోరాటం అనేది సామాజిక బాధ్యత. ఈ యుద్ధానికి అందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. 'కరోనా వైరస్'ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ప్రకటించింది. ఈ క్రమంలో దీన్ని ఎదుర్కునేందుకు పెద్ద ఎత్తున నిధులు కూడా అవసరమవుతాయి.
'కరోనా వైరస్'ను సమర్ధంగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ..హ్యాండ్ శానిటైజర్లు వాడాలని.. ముఖానికి మాస్కులు ధరించాలని ప్రచారం చేస్తున్నాయి.
'కరోనా వైరస్'కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.
'కరోనా వైరస్' ...ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 'లాక్ డౌన్' పాటిస్తున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయవచ్చన్నది ఆలోచన. అందుకే చాలా దేశాలు నిర్బంధంగా 'లాక్ డౌన్' విధించాయి. ఐతే జనం మాత్రం అన్ని దేశాల్లో బయటకు వచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తక్కువ మంది సంగీత దర్శకుల్లో ఒకరు దేవీ శ్రీ ప్రసాద్. డీఎస్పీగా సంగీత ప్రియులకు సుపరిచితమైన దేవీ శ్రీ ప్రసాద్.. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, సంగీత ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు.
'కరోనా' ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో దేశాలను భయపెడుతున్న 'కరోనా వైరస్' భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది.
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో.. మనసున్న మారాజుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పక తప్పదు.
తెలుగు సినిమా పరిశ్రమలోని యంగ్ హీరోగా వెలుగొందుతున్న హీరో నితిన్...మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు .. నేనున్నానంటూ ముందుకొచ్చాడు. గతంలోనూ వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి ముప్పు ఏర్పడినప్పుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించాడు.
'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు.
చైనాలో మొదలైన 'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటి వరకు జనం చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. ఇంకా కడుక్కుంటూనే ఉన్నారు. సామూహిక జీవనానికి దూరంగా ఉంటున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, పార్టీలు, దుకాణాలు, థియేటర్లు, స్కూళ్లు.. ఇలా అన్నీ బంద్ చేసే పరిస్థితి దాపురించింది.
తెలుగు సినిమా పరిశ్రమలోని యంగ్ హీరోగా వెలుగొందుతున్న హీరో నితిన్...మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు .. నేనున్నానంటూ ముందుకొచ్చాడు. గతంలోనూ వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి ముప్పు ఏర్పడినప్పుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించాడు.
'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం కూడా చూస్తున్నాం.
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ... ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు (Nutrition food) లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్ (Coronavirus) ఎటాక్ చేస్తోన్న సమయం కనుక ఏయే పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 ( COVID-19) స్క్రీనింగ్ లేకుండానే భారత్‌కి రావడం కలకలం సృష్టించింది.
ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ..కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇది.. అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ ప్రభావానికి ఏ రంగమైనా గజగజా వణికిపోతోంది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.