Virat Kohli: 'నన్ను అలా పిలవకండి'... ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన కోహ్లీ..

IPL 2024-RCB: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ కోసం కొత్త జెర్సీని లాంచ్ చేసింది ఆర్సీబీ. ఈ జెర్సీని విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఆవిష్కరించారు.  

Written by - Samala Srinivas | Last Updated : Mar 20, 2024, 02:50 PM IST
Virat Kohli: 'నన్ను అలా పిలవకండి'... ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన కోహ్లీ..

RCB Unbox Event 2024 highlights: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే దేశవ్యాప్తంగా ఐపీఎల్ సంబరాలు షురూ అయ్యాయి. మార్చి 22న జరగబోయే తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కొత్త జెర్సీని పరిచయం చేసింది ఆర్సీబీ. ఈ జెర్సీని విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన మరియు ప్లెసిస్ ఆవిష్కరించారు.ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వుమెన్స్ టీమ్ కు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ పురుషుల జట్టు నుండి ప్రత్యేక గౌరవం లభించింది. మహిళల జట్టు  కప్ గెలిచింది.. ఇప్పుడు పురుషుల వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మెన్స్ టీమ్ పై ఒత్తిడి మరింత పెరిగింది. 

ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్  సందర్భంగా కోహ్లీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని.. విరాట్ అని పిలిస్తే చాలా అని అన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండ్యూల్కర్ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది కోహ్లీనే. అందుకే ఇతడిని రన్ మెషీన్, కింగ్ కోహ్లీ అని అభిమానులు ముద్దుగా పిలిచుకుంటారు. ఒత్తిడిలో విరాట్ ఆడినట్టు ఎవరూ ఆడలేరు. ప్రెషర్ ఎంత ఉంటే కోహ్లీ అంత బాగా ఆడతాడు. జట్టులోకి మళ్లీ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. 

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వైషక్ విజయ్‌కుమార్, ఆకాష్ దీప్, మొహమ్‌మెద్, సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్ మరియు స్వప్నిల్ సింగ్.

Also read: IPL 2024: ముంబై ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఫిటినెస్ టెస్టులో ఫెయిల్ అయిన టీ20కా బాప్.. తొలి మ్యాచ్ కు దూరం..

Also Read: IPL 2024 Updates: మూడు రోజుల్లో ఐపీఎల్.. ఇంతలో ముంబైకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News