Rohit Sharma to quit Mumbai Indians: 2024 ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఇండియన్స్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంది. బ్యాటర్ గా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా విఫలమవ్వడంతో అతడిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. పాండ్యాను పక్కనపెట్టి రోహిత్ ను కెప్టెన్ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ముంబైకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడం పట్ల రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అతడు జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ న్యూస్ ఛానెల్ వార్తా కథనం ప్రచురించింది. ఇదే ఆలోచనలో స్టార్ బౌలర్ బుమ్రా, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారని తెలిపింది. ఒక వేళ ఇదే వార్త నిజమై రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే రికార్డులన్నీ బద్దలవుతాయి.
విఫలమైన పాండ్యా..
ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు చేసింది టీమ్ మేనెజ్మెంట్. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కాదని.. లీగ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుండి ట్రేడ్ చేయబడిన హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా నియమించింది ఫ్రాంచైజీ. కెప్టెన్సీ మార్పు ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. సీనియర్ అయిన రోహిత్ కాదని.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంపై ముంబై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. పోని కెప్టెన్ చేశాక హార్దిక్ వెలగబెట్టింది ఏమైనా ఉందంటే అది లేదు. అతడు వ్యక్తిగతంగా విఫలమవ్వడమే కాక.. జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఓపెనింగ్ బౌలింగ్ బుమ్రాను కాదని వేరొక బౌలర్ కు ఇవ్వడం, రోహిత్ ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయించడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించాయి.
Also Read: IPL 2024 Updates: ఊపిరి పీల్చుకో ముంబై.. టీ20కా బాప్ వచ్చేస్తున్నాడు..!
రోహిత్ కు కెప్టెన్సీ..
ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమాత్రం బాగోలేదని రిపోర్టులు చెబుతున్నాయి. కొంత మంది రోహిత్ వర్గంగా, మరికొందరు పాండ్యా వర్గంగా వీడిపోయారని వార్తలు వస్తున్నాయి. స్టార్ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నప్పటికీ ఒక మ్యాచ్ కూడా గెలవకపోవడంపై పాండ్యా నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచులు ఆడిన తర్వాత హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తప్పించి రోహిత్ శర్మను సారథిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాడిగా, కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి పాండ్యాకు మరో రెండు మ్యాచులు మాత్రమే ఉన్నాయి. మరి ఈ సారైనా రాణిస్తాడేమో చూడాలి.
Also Read: Rishabh Pant: బుద్ధి మారని పంత్.. మరోసారి అలా చేస్తే అతడిపై వేటు పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి