Shane Warne: 10 సంవత్సరాల క్రితం వైన్ కూడా ఉంది.. మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన షేన్‌ వార్న్‌ మేనేజర్‌!!

Shane Warne manager James Erskine: థాయ్‌లాండ్‌లో విహార యాత్రలో ఉన్న క్రికెట్ లెజెండ్ షేన్‌ వార్న్‌ మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో అతని మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 09:20 AM IST
  • స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి
  • మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన షేన్‌ వార్న్‌ మేనేజర్‌
  • 10 సంవత్సరాల క్రితం వైన్ కూడా ఉంది
 Shane Warne: 10 సంవత్సరాల క్రితం వైన్ కూడా ఉంది..  మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన షేన్‌ వార్న్‌ మేనేజర్‌!!

Shane Warne didn't drink much says manager James Erskine: స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ శుక్రవారం (ఫిబ్రవరి 4) అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. థాయిలాండ్‌లోని విల్లాలో గుండె నొప్పితో బాధపడుతూ 52 ఏళ్ల వార్న్‌ మరణించారు. వార్న్ అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించినా.. అప్పటికే ఆయన మరణించారు. థాయ్‌లాండ్‌లో విహార యాత్రలో ఉన్న క్రికెట్ లెజెండ్ మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో అతని మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ చెప్పారు.

ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక ది ఏజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ మాట్లాడుతూ... 'షేన్‌ వార్న్‌ మరో 3-4 రోజుల్లో వ్యాఖ్యానం కోసం ఇంగ్లండ్ వెళ్లేవారు. యూకే వెళ్లేముందు దొరికిన సమయాన్ని తన స్నేహితులతో గడిపేందుకు వార్న్‌ థాయ్‌లాండ్‌కు వెళ్లారు. నిజానికి వార్న్‌ బాగా తాగుతాడని అందరూ అనుకుంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. 10 సంవత్సరాల క్రితం నేను క్రేట్ వైన్ పంపాను. అది ఇప్పటికీ ఆయన వద్ద ఉంది. డ్రగ్స్ కూడా తీసుకోడు. మాదకద్రవ్యాలపై పెద్దగా ఆసక్తి చూపించరు' అని అన్నారు. 

'చనిపోయే ముందు షేన్‌ వార్న్‌ మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోతో భోజనం చేద్దామనుకున్నాడు. సాయంత్రం మరికొంత మందిని స్నేహితులను వారిద్దరూ కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు. కంగారుపడిన నియో.. ఆపై నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించారు. హృదయ స్పందన లేకపోవడంతో..  సీపీఆర్‌ చేశారు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చింది. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని డాక్టర్లు చెప్పారు' అని ఎర్స్‌కిన్‌ చెప్పారు.

'చనిపోయే రెండు గంటల ముందు షేన్ వార్న్‌ను చివరగా చూశా. అతను ఏక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా చురుగ్గా ఉన్నారు' అని వార్న్ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ చెప్పుకొచ్చారు. వార్న్ చనిపోయిన విల్లాను ఫోరెన్సిక్ బృందం తనిఖీ చేసిందని థాయ్‌లాండ్ పోలీసులు శనివారం తెలిపారు. వార్న్ స్నేహితుల నుంచి కూడా వారు వాంగ్మూలాలను తీసుకున్నారు. ఇక వార్న్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. 

Also Read: Cat bite : షాకింగ్ న్యూస్.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి!

Also Read: Horoscope March 6 2022: నేటి రాశిఫలాలు...ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News