Jos Buttler: రెండు బంతుల్లో ప్రపంచ రికార్డ్‌ మిస్‌ చేసుకున్న జోస్‌ బట్లర్‌.. టాప్‌లోనే ఏబీ డివిలియర్స్‌!

Jos Buttler Misses AB de Villiers Fastest 150 runs In ODI. వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్‌ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం జోస్‌ బట్లర్‌ కోల్పోయాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 01:05 PM IST
  • రెండు బంతుల్లో ప్రపంచ రికార్డ్‌ మిస్‌ చేసుకున్న బట్లర్‌
  • టాప్‌లోనే ఏబీ డివిలియర్స్‌
  • అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్‌
Jos Buttler: రెండు బంతుల్లో ప్రపంచ రికార్డ్‌ మిస్‌ చేసుకున్న జోస్‌ బట్లర్‌.. టాప్‌లోనే ఏబీ డివిలియర్స్‌!

Jos Buttler Misses AB de Villiers Fastest 150 runs In ODI: మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఇంగ్లండ్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. ఫిలిప్‌ సాల్ట్ (122; 93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జొస్ బట్లర్ (162 నాటౌట్; 70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సులు), లియామ్ లివింగ్‌స్టోన్ (66 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు)   చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. అనంతరం 49.4 ఓవర్లలో 266 పరుగులకు నెదర్లాండ్స్‌ ఆలౌట్‌ అయింది. దాంతో ఇంగ్లండ్‌ 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ వీరవిహారం చేశాడు. 70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సులతో 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో బట్లర్‌ తృటిలో ప్రపంచ రికార్డ్‌ మిస్‌ చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్‌ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం కోల్పోయాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ టాప్‌లో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 64 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. 

నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ 65 బంతుల్లో 150 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే బట్లర్‌ ఏబీ డివిలియర్స్‌ రికార్డును బద్దలు కొట్టకపోయినా.. తన పాత రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. 2019లో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో బట్లర్‌ 76 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇంకో రెండు తక్కువ బంతుల్లోనే 150 పరుగులు సాధించి ఉంటే.. ఏబీడీని కూడా అధిగమించి కొత్త చరిత్ర సృష్టించేవాడు. త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. 

 

2011లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ 83 బంతుల్లోనే 150 పరుగులు బాదాడు. దాంతో వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్‌ సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ హిట్టర్ క్రిస్‌ గేల్‌, పాకిస్థాన్‌ బ్యాటర్ షర్జీల్‌ ఖాన్‌ చెరో 85 బంతుల్లో 150 పరుగులు సాధించి వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. 

Also Read: Virata Parvam 1st Day Collections: సాయి పల్లవి-రానా 'విరాటపర్వం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...  

Also Read: KCR SHOCK: టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News