SRH CEO Kaviya Maran: హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప ధైర్యం చేసిందబ్బా! ఆ ఆటగాడి కోసం 10.75 కోట్లు పెట్టింది!!

SRH CEO Kaviya Maran: వెస్టిండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్‌ చివరి వరకు ప్రయత్నించి సక్సెస్ అయింది. మొదటి నుంచి పూరన్ కోసం కావ్య పాప ప్రయత్నించింది. కోల్‌కతా ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ కావ్య వెనక్కి తగ్గలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 07:22 PM IST
  • హసరంగా కోసం రంగంలోకి దిగినా
  • హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప ధైర్యం చేసిందబ్బా
  • ఆ ఆటగాడి కోసం కావ్య 10.75 కోట్లు పెట్టింది
 SRH CEO Kaviya Maran: హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప ధైర్యం చేసిందబ్బా! ఆ ఆటగాడి కోసం 10.75 కోట్లు పెట్టింది!!

Finally SRH CEO Kaviya Maran buy Nicholas Pooran : బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 వేలం రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తోంది. నచ్చిన ఆటగాడి కోసం కొన్ని ప్రాంఛైజీలు అస్సలు తగ్గట్లేదు. భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసుకుంటున్నాయి. ఇందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే పెద్ద నిదర్శనం. ఇషాన్ కిషన్ కోసం ముంబై 15 కోట్లకు పైన వెచ్చించగా.. దీపక్ చహర్ కోసం చెన్నై 14 కోట్లు పెట్టింది. అయితే తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఎప్పటిలానే కాస్త పిసినారితనం చూపెట్టింది. 

వేలం ఆరంభం అయి చాలా సమయం గడిచినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్‌పై విమర్శల వర్షం కురిసింది. అయితే శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా కోసం రంగంలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గట్టిపోటీ ఇవ్వడంతో వెనక్కి తగ్గింది. ఆపై ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ కోసం ఇతర ప్రాంచైజీలతో పోటీపడి తొలి ఆటగాడిని తీసుకుంది. కోటి 50 ల‌క్ష‌ల రూపాయ‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి దిగిన సుంద‌ర్‌ను స‌న్‌రైజ‌ర్స్ 8 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసింది.

ఇక వికెట్ కీపర్ కేటగిరీలో స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవడానికి కావ్య మారన్ చాలా ప్రయత్నించింది. ఇందుకోసం ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టింది. ఇషాన్ కోసం తొలుత ముంబై, పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. 10 కోట్ల రూపాయల వరకు వెళ్లింది. ఆ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. అయినా ముంబై వెనక్కి తగ్గకపోవడంతో కావ్య మారన్ డ్రాప్ అయింది. 

వెస్టిండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ కోసం కావ్య మారన్ చివరి వరకు ప్రయత్నించి సక్సెస్ అయింది. మొదటి నుంచి పూరన్ కోసం కావ్య పాప ప్రయత్నించింది. కోల్‌కతా ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ కావ్య వెనక్కి తగ్గలేదు. చివరికి ధర 10 కోట్ల రూపాయలను దాటినా.. వెనకడుగువేయలేదు. చివరికి 10 కోట్ల 75 లక్షల రూపాయలతో పూరన్‌ను కొనుగోలు చేసింది. దాంతో సన్‌రైజర్స్ వికెట్ కీపర్‌గా నికొలస్ ఎంపికయ్యాడు. దాంతో ఆమెపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. 'హమ్మయ్య.. ఎట్టకేలకు కావ్య పాప ధైర్యం చేసిందబ్బా', 'మా కావ్య పాప సూపర్' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Deepak Chahar: నక్కతోక తొక్కిన దీపక్ చహర్.. ఊహించని ధర పెట్టిన చెన్నై! ధోనీ కంటే ఎక్కువ!!

Also Read: Ishan Kishan MI: ఇషాన్ కిషన్‌పై కాసుల వర్షం.. 'తగ్గేదేలే' అంటూ భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News