IND vs SA 3rd ODI Playing XI Out: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆరంభం కానుంది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండడంతో మ్యాచ్ అరగంట ఆలస్యంగా ఆరంభం అవుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని గబ్బర్ చెప్పాడు. దాంతో యువ ప్లేయర్స్ రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ కుమార్‌లకు నిరాశే ఎదురైంది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ బావుమా, తాత్కాలిక సారథి మహారాజ్ అనారోగ్యానికి గురవడంతో డేవిడ్ మిల్లర్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. ఏ సిరీస్‌లోని మూడు మ్యాచులకు ముగ్గురు కెప్టెన్లు మారారు. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
🚨 Team News 🚨#TeamIndia remain unchanged. #INDvSA
Follow the match 👉 https://t.co/XyFdjVrL7K
A look at our Playing XI 🔽 pic.twitter.com/icw7Y2fDJe
— BCCI (@BCCI) October 11, 2022
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మలన్, రీజా హెండ్రిక్స్, ఇడెన్ మార్‌క్రమ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, ఫెహ్లుక్వాయో, ఫొర్టుయిన్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్జ్.
Also Read: ఇదేందయ్యో ఇది.. దీన్ని నేనెక్కడా చూడలే! వీడి డాన్స్ చూస్తే షాక్ అవ్వడం పక్కా
Also Read: అచ్చు భక్తుల మాదిరిగానే.. దేవుడి ముందు మోకరిల్లిన మేక! ఏం ప్రార్థించిందో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook