BCCI appoints VVS Laxman as Team India head coach for Asia Cup 2022: ఆసియా కప్ 2022 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా హైదరాబాద్ సొగసరి, భారత మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ 2022 టోర్నీ వరకు లక్ష్మణ్ కోచ్‌గా ఉంటారని స్పష్టం చేసింది.
ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దాంతో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే సిరీస్‌లో కోచ్‌గా వ్యవహరించారు. టీ20, వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆసియా కప్‌ల కూడా లక్ష్మణ్ మార్క్ కనిపిస్తుందని బీసీసీఐ నమ్ముతోంది. కరోనా బారిన పడిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని బీసీసీఐ తెలిపింది. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత ద్రవిడ్ భారత బృందంలో చేరతారని పేర్కొంది.
యూఏఈ వేదికగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ 2022 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 28న దాయాది దేశాలు పాకిస్థాన్, భారత్ తలపడనున్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్ కోసం బీసీసీఐ గతంలోనే ఎంపిక చేసింది. ఇక కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లకు జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, మొహ్మద్ షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 749కే రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్!
Also Read: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన అఫ్రిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook