IND Vs NED World Cup 2023 Updates: చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా సిక్సర్ల వర్షం.. శ్రేయాస్, రాహుల్ శతకాల మోత

India Vs Netherlands 1st Innings Updates: నెదర్లాండ్స్‌పై టీమిండియా చెలరేగి ఆడారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల మోత మోగించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు బాదారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 12, 2023, 06:14 PM IST
IND Vs NED World Cup 2023 Updates: చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా సిక్సర్ల వర్షం.. శ్రేయాస్, రాహుల్ శతకాల మోత

India Vs Netherlands 1st Innings Updates: దీపావళికి సందర్భంగా అభిమానులకు టీమిండియా బ్యాట్స్‌మెన్ పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు. దేశం మొత్తం టపాసుల మోత మోగుతుంటే.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత బ్యాట్స్‌మెన్ సిక్సర్ల మోత మోగించారు. శ్రేయాస్ అయ్యార్ (128), కేఎల్ రాహుల్ (102) శతకాలతో చెలరేగిన వేళ నెదర్లాండ్స్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51)కూడా అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ 400 పైగా పరుగులు చేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై 413 పరుగులు టాప్ స్కోరుగా ఉంది. అదేవిధంగా వరల్డ్ కప్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. వన్డే చరిత్రలో మూడోసారి.

టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగానే.. పరుగుల వరద పారనుందని అభిమానులు ముందే ఫిక్స్ అయిపోయారు. అందుకే తగ్గట్లుగానే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలోనే 100 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. శుభ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51  3 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త తక్కువ పరుగుల వ్యవధిలోనే ఔట్ అయ్యారు. ఆ తరువాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేసిన వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తరువాత కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి రాగా.. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లు అయింది నెదర్లాండ్స్ బౌలర్ల పరిస్థితి. అవతలి ఎండ్‌లో శ్రేయాస్ పాతుకుపోగా.. కేఎల్ రాహుల్ చక్కటి సహాకారం అందించారు. ఇద్దరు స్ట్రైక్ రోటేట్ చేస్తునే.. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 208 (128 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. మరో బంతి మిగిలి ఉండగా.. భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 62 బంతుల్లోనే సెంచరీ చేసి.. వరల్డ్ కప్‌లో టీమిండియా తరుఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ (63 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. 

భారత బ్యాట్స్‌మెన్ ధాటికి నెదర్లాండ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. లోగాన్ వాన్ బీక్ 10.70 ఎకానమీతో 10 ఓవర్లలో 107 పరుగులు ఇచ్చాడు.. పాల్ వాన్ మీకెరెన్ 10 ఓవర్లలో 90 పరుగులు, బాస్ డి లీడే 10 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకున్నారు. టీమిండియా బ్యాట్స్‌మెన్ మొత్తం 16 సిక్సర్లు, 37 ఫోర్లు బాదారు. బాస్ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీశారు. 

Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News