England Announce Playing 11 for Ranchi test: శుక్రవారం (ఫిబ్రవరి 23) నుండి రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మెుదలుకానుంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి షాక్ లో ఉన్న ఇంగ్లండ్ కు రాంచీ టెస్టు చావోరేవో లాంటింది. ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమయం చేయాలని చూస్తోంది స్టోక్స్ సేన. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చేసింది. మార్క్‌వుడ్, రెహాన్ అహ్మద్‌లను తప్పించి.. వారి స్థానాల్లో పేసర్ ఓలీ రాబిన్సన్, యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.
రాంచీ టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ మరియు షోయబ్ బషీర్ .
We have named our XI for the fourth Test in Ranchi! 🏏 👇
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket
— England Cricket (@englandcricket) February 22, 2024
భారత్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. అయితే టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యంతో రెండు, మూడు టెస్టుల్లో ఓడిపోయింది. కీలకమైన నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలని స్టోక్స్ సేన తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు వరుసగా రెండో టెస్టుల్లో గెలిచి మాంచి ఊపుమీద ఉంది టీమిండియా. రాంచీ టెస్టులో గెలిచి ఎలాగైనా సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందుబో భాగంగానే నాలుగో టెస్టుకు స్పిన్ పిచ్ ను సిద్దం చేసింది. పిచ్‌పై పగుళ్లు ఉన్న నేపథ్యంలో పిచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేనని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ చెప్పాడు. స్టార్ పేసర్ బుమ్రాకు ఈ టెస్టులో విశ్రాంతినివ్వనుంది.
Also Read: Yuvraj Singh: ఎంపీగా పోటీ చేయనున్న యువరాజ్ సింగ్.. ఏ పార్టీ నుంచంటే?
Also Read: Sachin Tendulkar: కశ్మీర్లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter