Ind vs Eng 1st T20: ఇంగ్లాండ్‌తో జరగనున్న 5టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత్‌కు టీ20 ప్రపంచ కప్ జట్టును సిద్ధం చేయనుంది. సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేయనున్నారు. మార్చి 12న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
అక్టోబర్‌లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే అందుకు ప్రధాన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రమాదకారి అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టుపై ఓ అంచనాకు రావచ్చునని విరాట్ కోహ్లీ(Virat Kohli) పేర్కొన్నాడు.
Also Read: Cricketers vs Tv Anchors: టీవీ యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే
టీ20 వరల్డ్ కప్ జరగనున్న వేదికగా టీమిండియాపై సిరీస్ ఆడనుండటం తమకు కలిసొచ్చే అంశమని ఇంగ్లాండ్ కీపర్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ చెప్పాడు. టెస్టు సిరీస్ వైఫల్యాన్ని పక్కనపెట్టి టీ20 సిరీస్ నెగ్గడంపై ఇంగ్లాండ్ జట్టు ఫోకస్ చేస్తుందని బట్లర్ తెలిపాడు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతానికి కేవలం ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ నెగ్గడంపై ఫోకస్ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు సమష్టిగా జట్టుగా రాణిస్తారో, లేక వ్యక్తిగతంగా రాణిస్తారా అనేది కీలకం కానుందని రోహిత్ శర్మ(Rohit Sharma) తన మనసులో మాటను వెల్లడించాడు. రిషబ్ పంత్‌ను స్వేచ్ఛగా ఆడినిస్తేనే ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డాడు.
Also Read: IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్స్ MS Dhoni ప్రాక్టీస్ షురూ, టైటిల్ లక్ష్యంగా సీఎస్కే
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లలో ఒకరు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అయితే మరో ఓపెనర్ ధావన్ కావడానికే అధికంగా అవకాశాలు ఉండటంతో కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. శ్రేయస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరు బెంచ్‌పై ఉండాల్సి వస్తుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దాడికి సిద్ధమయ్యాడు. యుజువేంద్ర చాహల్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
India: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్ (రిజర్వ్ వికెట్ కీపర్).
England: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాస్ బట్లర్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, సామ్ బిల్లింగ్స్, జానీ బెయిర్‌స్టో, జోఫ్రా ఆర్చర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook