Harbhajan Singh: సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు (Harbhajan Singh retirenment) తెలుస్తోంది. వార్తా సంస్థ దైనిక్ జాగరన్ నివేదిక ప్రకారం గురువారమే భజ్జీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.
హర్భజన్ సింగ్ చివరి సారిగా 2015లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో (Harbhajan Singh international cricket) అడాడు. ప్రస్తుతం భజ్జీ వయసు 41 సంవత్సరాలు. తన వయసును దృష్టిలో ఉంచుకుని ఇక ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని హర్భజన్ భావిస్తున్నట్లు దైనిక్ జాగరన్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు (Harbhajan Singh latest Update) పేర్కొంది. టీమ్ ఇండియా అత్యుత్తమ స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ కూడా ఒకరు.
ఐపీఎల్లో ఉన్నతస్థాయి పోస్ట్?
రిటైర్మెంట్ తర్వాత.. ఐపీఎల్ 2022లో ఓ ఫ్రాంఛైజీలో ఉన్నతస్థాయి పోస్ట్‌లో చేరాలని కూడా హర్భజన్ ఆలోచిస్తున్నట్లు నివేదిక వివరించింది.
రాజకీయాల్లోకి ఎంట్రీ?
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో హర్భజన్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు (Harbhajan Singh to Join Politics) వార్తలొస్తున్నాయి. ఇటీవల అతడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను కలిశాడు. దీనితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇంతకు ముందు కూడా హర్భజన్ సింగ్ బీజేపీలో చేరుతాడనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని భజ్జీ తిరస్కరించడం గమనార్హం.
Also read: Team India vs South Africa: టీమ్ ఇండియా స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిన దక్షిణాఫ్రికా
Also read: Pakistani Cricketers Wives: మోడల్స్‌ను తలపించే అందమైన పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు వీళ్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook