Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. ఫుట్‌బాల్ చరిత్రలో దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసి రొనాల్డో(Cristiano Ronaldo) తొలిస్థానానికి దూసుకెళ్లాడు. ఫిఫా(FIFA) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం రాత్రి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్(Republic of Ireland)తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ చేయడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు.
ప్రస్తుతం ఫిపా(FIFA) లెక్కల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్‌లలో 111 గోల్స్‌తో టాపర్‌గా ఉన్నాడు. ఇరాన్‌కు చెందిన అలీ దాయ్(Ali Daei) 149 మ్యాచ్‌లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్‌లలో 89 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు. ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్(Portugal) తరపున అత్యధిక మ్యాచ్‌లు (180) ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు. టీమ్‌ఇండియా సారథి సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) 74 గోల్స్‌తో 12వ స్థానంలో నిలిచాడు.
‘'నాకెంతో సంతోషంగా ఉంది. కేవలం ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినందుకే కాదు. మేమంతా కలిసి ప్రత్యేక సందర్భాలను ఆస్వాదించాం. ఆట చివర్లో రెండు గోల్స్ చేయడం తేలిక కాదు. అందుకే జట్టు కష్టపడ్డ తీరును నేను అభినందిస్తున్నా. ఆఖరి వరకు మేం గెలుస్తామనే నమ్మాం'' అని రొనాల్డొ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని రొనాల్డో గోల్‌గా మలచలేకపోయాడు. అయితే 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. రెండో అర్ద భాగంలో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. పోర్చుగల్ జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా రొనాల్డో(Ronaldo) తన మ్యాజిక్‌ను చూపించాడు. ఆట 89వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో హెడర్‌తో గోల్ కొట్టి పోర్చుగల్‌కు తొలి గోల్‌ను అందించాడు. అదననపు సమయం ఆట(90+6) నిమిషంలో రొనాల్డో మరో గోల్ కొట్టడంతో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1తో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక తన కెరీర్‌లో ఆఖరి 15 నిమిషాల్లో రొనాల్డో 33 గోల్స్ చేయడం విశేషం. ఇక రొనాల్డో ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత జూవెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్(Manchester United)కు మారిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook