India Beat Netherlands: పసికూన నెదర్లాండ్స్‌పై టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) మరోసారి పేలవ ఫామ్‌ను కొనసాగించగా.. హిట్ మ్యాన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఆ తరువాత విరాట్ కోహ్లి (44 బంతుల్లో 62), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51) అర్ధసెంచరీలతో చెలరేగి ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ చెరో వికెట్ పడగొట్టారు.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆదిలోనే భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించాడు. మొదటి రెండు ఓవర్లు మెయిడెన్ వేశాడు. అంతేకాకుండా ఓపెనర్ విక్రమ్ జీత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన నెదర్లాండ్స్ ఛేజింగ్‌లో డీలా పడిపోయింది. ఆ తరువాత టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. టిమ్ ప్రింగ్లే మాత్రం అత్యధికంగా 20 పరుగులు చేశాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లకు 123 పరుగులు చేసి.. 56 పరుగుల తేడాలో ఓటమి పాలైంది నెదర్లాండ్స్. టీమిండియా బౌలర్లలో భూవీ, అర్షదీప్, అశ్విన్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. షమీకి ఒక వికెట్ దక్కింది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ తరుపున కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే టీ20ల్లో తమ మొదటి రెండు ఓవర్లు మెయిడెన్స్ వేశారు. 2012లో మొదటిసారి ఇంగ్లండ్‌పై హర్భజన్ సింగ్ రెండు ఓవర్లు మెయిడెన్ వేశాడ. ఆ తరువాత బుమ్రా 2016లో పాక్‌పై తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అదే ఏడాది యూఏఈపై రెండు ఓవర్లు మెయిడెన్ చేసిన భువనేశ్వర్.. మళ్లీ గురువారం నెదర్లాండ్స్‌పై మొదటి ఓవర్లు మెయిడెన్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ రికార్డును హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. భారత్ తరపున టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 63 సిక్సర్లతో మొదటిస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 34 సిక్సర్లు బాదగా రెండోస్థానానికి చేరుకున్నాడు. టీమిండిమా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ 33 సిక్సర్లతో ఇప్పటివరకు భారత్ తరఫున మొదటిస్థానంలో ఉన్నాడు. ఈ నెల 30న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.
Also Read: Director Esmayeel Shroff: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook