Asia Cup 2022: ఈసారి ఆసియా కప్ వారిదే..భారత మాజీ స్టార్ ప్లేయర్ జోస్యం..!

Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్-4లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈనేపథ్యంలో కప్ ఎవరిదన్న దానిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

Written by - Alla Swamy | Last Updated : Sep 6, 2022, 06:05 PM IST
  • ఆసియా కప్ 2022
  • నేడు కీలక మ్యాచ్
  • సెహ్వాగ్ జోస్యం
Asia Cup 2022: ఈసారి ఆసియా కప్ వారిదే..భారత మాజీ స్టార్ ప్లేయర్ జోస్యం..!

Asia Cup 2022: ఆసియా కప్ విజేత గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూపర్-4లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరగబోతోందన్నాడు. ఈమ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే దయాది దేశం పాకిస్థాన్‌దే ఆసియా కప్ అని జోస్యం చెప్పాడు. భారత అభిమానులకు ఇది మింగుడు పడని విషయమన్నాడు.

సూపర్-4లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయం చూస్తే ఇదే జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశాడు. మరోవైపు ఆసియా కప్‌లో ఇకపై భారత్‌ చావో రేవోకానుంది. శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్లపై టీమిండియా గెలవడంతోపాటు భారీగా రన్‌రేట్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవాళ్టి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. శ్రీలంకపై గెలిస్తే ట్రోఫీలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఒకవేళ ఓడిపోతే టీమిండియా ఇంటిబాట పట్టనుంది. ఇకపై రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచినా..ఫైనల్‌కు వెళ్లాలంటే రన్‌రేట్ ముఖ్యం కానుంది. ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఒక్కో విజయాన్ని సాధించాయి. రెండో ప్లేస్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా రెండు విజయాలతోపాటు భారీగా రన్‌రేట్‌తో విజయఢంకా మోగించాల్సి ఉంది. అందుకే భారత జట్టు టాస్‌ గెలవగానే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది..ఒక వేళ ఫీల్డింగ్ తీసుకున్నా..పొదుపుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా డూ అర్ డై మ్యాచ్‌లు కానున్నాయి.

రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుస్తే ఫైనల్‌లో భారత్‌కు పాకిస్థాన్‌ జట్టే ప్రత్యర్థికానుంది. ఎందుకంటే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లే పెద్దవిగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఈరెండు జట్లే స్ట్రాంగ్‌ ఉన్నాయి. శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లోనే ఇంటికి బాట పట్టక తప్పదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో టీమిండియా బరిలోకి దిగితే ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారు.

Also read:Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్యప్రచారం దేనికీ..బీజేపీ నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్..!

Also read:BJP: స్పీడ్ పెంచిన కమలనాథులు.. ఆ 144 లోక్‌సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News