Tulasi Pooja Benefits: వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ మొక్కను హిందువులు సాక్ష్యత్తు లక్ష్మిదేవిగా భావిస్తారు. అందుకే భక్తులంతా శ్రీ హరివిష్ణువుకు తులసి మాల సమర్పిస్తారు. తులసి చెట్టు ఇంట్లో అనుకూల, ప్రతికూల శక్తులను కూడా తెలియజేస్తుంది. ఈ మొక్క పూర్తిగా ఎండిపోతే ఇంట్లో ప్రతికూల శక్తి తిరుతుందిగా వాస్తు నిపుణులు భావిస్తారు. ప్రతి రోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఇంట్లో ఆనందం, సంపద కూడా రెట్టింపు అవుతుంది. అయితే తులసి మొక్క ఏయే సమయాల్లో పూజించడం మంచిదో, పూజా పద్ధతులు ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులసి పూజ నియమాలు:
తులసి మొక్కకు ప్రతిరోజు గంగాజలంతో ప్రతి రోజు అభిషేకం చేయడం వల్ల ఎలాంటి సమస్యలైన సులభంగా తీరిపోతాయని పూర్వీకుల నమ్మకం..అయితే కొన్ని రోజుల్లో మాత్రం తులసికి అభిషేకం చేయడం మానుకోవాలన్నారు. ఆదివారం, ఏకాదశి రోజున ఎట్టిపరిస్థితుల్లో కూడా తులసిని తాకడం, అభిషేకం చేయకూడదు. అంతేకాకుండా స్నానం చేయకుండా కూడా తులసి ఆకులను తాకడం కూడా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏకాదశి, ఆదివారం రోజున నిర్జల వ్రతాన్ని ఆచరించేవారు తులసి ఆకులను కోయడం మానుకోవాల్సి ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం పూట తులసి ఆకులను అస్సలు ముట్టకూడదు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తులసి పూజ విధానం:
తులసి పూజను చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తువులను ధరించాలి.
తులసిమాతకు చందనం సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలి.
తులసి మొక్కకు నీటిని సమర్పించి, గులాబీ పువ్వులను మొక్క వద్ద ఉంచాల్సి ఉంటుంది.
ఆ తర్వాత తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
తులసి పరిహారం:
కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలగడానికి.. సాయంత్రం కూడా తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుంది. తులసీ స్తోత్రాన్ని పఠించి..నమస్కరించాలి. ఇలా ప్రతి రోజు చేస్తే లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి