Saturn Transit 2024: కొత్త ఏడాదిలో గ్రహాల గోచారం కారణంగా మొత్తం అన్ని రాశుల జీవితాలపై ప్రభావం కన్పించనుంది. శని గ్రహం గోచారంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం కారణంగా ముఖ్యంగా 3 రాశులవారికి మహర్దశ పట్టనుంది. అంతులేని ధన సంపదలు వచ్చి పడనున్నాయి.
హిందూమతంలో కొన్ని గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, విశిష్టత ఉంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో వివిధ యోగాలు ఏర్పడి మొత్తం అన్ని రాశులపై అనుకూల లేదా ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. కొత్త ఏడాది ప్రారంభమౌతూనే కొన్ని కీలకమైన గ్రహాలు రాశి పరివర్తనం చెందనున్నాయి. అందులో ఒకటి శని గ్రహం. 2024లో శని గోచారంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం మూడు రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఈ మూడు రాశులకు అంతులేని ధన సంపదలు కురిపించనున్నాడు శని. ఏడాదంతా శని అనుగ్రహం ఈ మూడు గ్రహాలపై ఉంటుంది. ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. శని గోచారంతో ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో పరిశీలిద్దాం.
సింహ రాశి జాతకులకు త్రికోణ కేంద్ర రాజయోగం కారణంగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు అంతులేని లాభాలు వస్తాయి. వ్యాపారం కూడా విస్తృతమౌతుంది. ఇక జీవితంలో ఏ పని చేపట్టినా విజయం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతి లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో కూడా అనుకూలమైన సమయం. విద్యార్ధుల కెరీర్ బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
వృశ్చిక రాశి జాతకులకు శని గ్రహం గోచారంతో ఏర్పడనున్న త్రికోణ కేంద్ర రాజయోగంతో ఊహించని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి కచ్చితంగా ఉంటుంది. లేదా కొత్త ఉద్యోగావకాశాలు లాభిస్తాయి. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. అదృష్టం తోడవడంతో అన్నింట్లో కలిసొస్తుంది. రిటైల్, వ్యాపారం, మందులు వంటివాటికి సంబంధించి లాభం చేకూరనుంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త గా ఉండాలి.
కుంభ రాశి జాతకులకు శని గ్రహం గోచారం కారణంగా అంతా అనుకూలిస్తుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది. గతంలో ఎప్పుడో ఎక్కడో నిలిచిపోయిన డబ్బుులు చేతికి అందుతాయి. విద్యార్ధులకు కెరీర్ బాగుంటుంది. పెళ్లికానివారికి వివాహ యోగం ఉంటుంది. వ్యాపారులకు చాలా అనువైన సమయం. కొత్త పెట్టుబడులు లాభించవచ్చు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also read: Budh Gochar 2023-2024: బుధుడు రాశి మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook