Mercury Transit 2023: వృషభరాశిలోకి బుధుడు, మే 15 నుంచి భారీ లాభాలే, లాభాలు!

Mercury Transit 2023: బుధుడు మీన రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2023, 04:48 PM IST
 Mercury Transit 2023: వృషభరాశిలోకి బుధుడు, మే 15 నుంచి భారీ లాభాలే, లాభాలు!

Mercury Transit 2023: గ్రహాలలో రారాజుగా పిలుచుకునే బుధుడు మార్చి 31 మధ్యాహ్నం 3.59 గంటలకు మీన రాశిలో నుంచి ఇతర రాశిలోకి సంచారం చేశాడు. వృషభరాశిలోకి బుధుడు సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడు మళ్లీ మే 15 ఉదయం 8.45 గంటలకు తిరోగమనం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో వ్యాపార రంగంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

బుధ గ్రహ సంచారం వల్ల మేష రాశివారికి ఊహించని ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నించేవారు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

వృషభ రాశి:
వృషభ రాశివారికి  పన్నెండవ స్థానంలో సంచారం జరుగబోతోంది. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాలి. పోటీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారతు. ప్రేమకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 
 
మిథున రాశి:
మిథున రాశివారికి పదకొండవ స్థానంలో బుధగ్రహ సంచారం జరిగింది. బుధగ్రహ ప్రభావం వల్ల అన్ని రాశులవారితో పాటు మిథున రాశివారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మంచి లాభాలు పొందుతారు. ఈ సంచారం వల్ల ఇల్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. 

కర్కాటక రాశి:
ఈ రాశివారికి పదవ స్థానంలో ఈ సంచారం జరుగుతంది. కాబట్టి వీరు పూర్వీకుల ఆస్తితో చాలా లాభాలు పొందుతారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసేవారు కూడా ఈ సంచారం వల్ల ప్రమోషన్స్‌ పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News