Maha Shivratri: నందీశ్వరుడి చెవిలో మీ కోరికలను చెప్పుకుంటున్నారా..?.. ఈ నియమాలను తప్పకుండా పాటించాలంట..!

Lord shiva: చాలా మంది శివుని ఆలయంలో వెళ్లి శివయ్య ముందు ఉన్న నందీశ్వరుడి చెవిలో ఏదో తమ కోరికలు చిట్టా చెప్పుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే.. ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 23, 2025, 08:34 PM IST
  • శివయ్య ముందు ఉన్న నందీపూజలు..
  • ఈ విధంగా పూజలు చేయాలని సూచనలు..
Maha Shivratri: నందీశ్వరుడి చెవిలో మీ కోరికలను చెప్పుకుంటున్నారా..?.. ఈ నియమాలను తప్పకుండా పాటించాలంట..!

Lord shiva nandi maharaj puja: సాధారణంగా ప్రతి ఒక్క దేవుడికి ఏదో ఒక వాహానం తప్పకుండా ఉంటుంది. ముల్లోకాల్ని పాలించే దేవుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. శ్రీ మన్నారయణుడు గరుత్మంతుడిని, శివయ్య నందీశ్వరుడ్ని , గణపయ్య మూషికంను, సుబ్రహ్మణ్యస్వామి నెమలిని ఇలా తక్కిన దేవతలు  కూడా ఏదో ఒక వాహనం మీద విహరిస్తు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. అయితే.. శివుడి దగ్గర ప్రమథ గణాలు ఉంటాయి. వీటిలో నందీశ్వరుడికి అగ్రస్థానం ఉంది. శివయ్య అంటే నందీకి విపరీతమైన స్వామి భక్తి. నందీశ్వరుడు శివుడి ముందే ఎల్లప్పుడు ఉంటారు.

ఒకసారి గజాసురుడు కపటోపాయంతో..  శివయ్యను ప్రసన్నంచేసుకుని తమ కడుపులో దాచుకుంటాడు. అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి.. శివయ్యను బైటకు తెచ్చుకుంటాడు. అదే విధంగా రావణాసురుడు ఒక సారి కైలాసంకు వస్తే.. ఆయనను బైటనే ఆపివేస్తాడు.

నందీశ్వరుడికి శివయ్య మీద విపరీతమైన భక్తి. అందుకే శివుడు ఒకసారి నందీశ్వరుడి భక్తికి మెచ్చి..ఏదైన వరం కోరుకొమ్మని అడిగారంట. దానికి నందీశ్వరుడు ఎల్లప్పుడుకూడా ఆయన ముందే ఉంటే.. శివయ్యను మాత్రమే చూస్తు ఉండే విధంగా వరం ఇమ్మని కోరారంట.దీనికి ముక్కంటి తథాస్తు చెప్పారంట.

అందుకే అప్పటి నుంచి ఎక్కడ శివాలయం ఉన్న దానిలో శివుడి ముందు లింగం తప్పకుండా ఉంటుంది. అంతే కాకుండా..  శివుడు, నందీ మధ్యలో పొరపాటున కూడా వెళ్లకూడదని  పండితులు చెప్తుంటారు. అయితే..చాలా మంది శివుడి ఆలయంలోకి వెళ్లినప్పుడు నందీ చెవిలో తమ కొరికల్నిచెప్పుకుంటారు.

Read more: Maha Shivratri: మొదటి సారి మహా శివరాత్రి వేళ ఉపవాసం ఉంటున్నారా...?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దంట..

కానీ అసలు... దీని కోసం కొన్నినియమాల్ని పాటించాలంట. నందీశ్వరుడికి కుడివైపున కూర్చుని.. ఆయన రెండు కొమ్ముల మీద.. బొటన వేలు, చూపుడు వేలు ఉంచి, ఎడమ చేయ్యి తోకమీదపెట్టి బొటన వేలు,చూపుడు వేలు మధ్యలో నుంచి శివుడ్నిచూడాలి.  ఆ తర్వాత నందీశ్వరుడి కుడి చేవిలో ఓం అని ఐదుసార్లు చెప్పుకున్న తర్వాత.. మనకోరికలను నందీశ్వరుడికి చెబితే.. ఆయన దాన్ని ముక్కంటి వరకు చేరవేస్తాడంట. ఈ విధానంను పాటించాలని పండితులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News