Kala Sarpa Dosham benefits: పురాతన జ్యోతిష్య గ్రంథాలలో కాలసర్ప దోషం యెుక్క ప్రస్తావన లేదు. ఇది ముఖ్యంగా గత 100 ఏళ్లలో వాడుకలోకి వచ్చింది. జాతకంలో ఈ దోషం (Kala Sarpa Dosham) ఉందంటే ఆ వ్యక్తి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి జాతకంలో రాహువు యెుక్క స్థానం అనుకూలంగా ఉంటే.. కాలసర్ప దోషం అతడికి ఊహించని పురోగతినిస్తుంది. కాల సర్పయోగం ఉన్న వారు అతిగా భయపడాల్సిన అవసరం లేదు. వీరు అదృష్టవంతులు మరియు అసాధారణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
ఈ ప్రముఖులకు కాల సర్పదోషం
కాల సర్ప దోషం ఉన్న వ్యక్తి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ యోగం ఉన్నవారు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ యోగం గౌతమ బుద్ధుడు, శంకరాచార్య స్వరూపానంద సరస్వతి, ఓషో రజనీష్ వంటి ఆధాత్మికవేత్తలకు.... హర్షవర్ధన్, అక్బర్, షాజహాన్, క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్ వంటి చక్రవర్తులకు, అబ్రహం లింకన్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్, ఐ.కె. గుజ్రాల్ వంటి రాజకీయ నాయకులకు...అమృతా ప్రీతమ్, మధుబాల, లతా మంగేష్కర్, సత్యజిత్ రే, ధీరూభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్ వంటి వారికి ఉంది.
శివుడిని ఆరాధించడం, దోష నివారణకు చర్యలు తీసుకోవడం మరియు నవనాగ స్తోత్రాన్ని నిరంతరం పారాయణం చేయడం ద్వారా కాల సర్ప యోగాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. వాస్తవానికి, కాల సర్ప యోగం అనేది భయాన్ని విడిచిపెట్టి.. పోరాటం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మీ జీవితాన్ని మలచుకోవడం.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Kala Sarpa Dosham: జాతకంలో కాలసర్ప దోషం ఉందా.. అయితే మీ లైఫ్ కు ఇక తిరుగుండదు!