Guru Gochar 2024 In Telugu: బృహస్పతి గ్రహాన్ని దేవతల గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహాన్ని దేవగురువు బృహస్పతిగా పిలుస్తారు. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చు. అయితే ఈ గురు గ్రహం దాదాపు 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచార ప్రక్రియ మే 1వ తేదిన జరగబోతోంది. ఈ రోజే గురు గ్రహం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మే 3 నుంచి జూన్ 3 వరకు ఈ గ్రహం వృషభ రాశిలో సంచార దశలో ఉంటుంది. ఆ తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి గురుడు రావడం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి:
గురు గ్రహ సంచారం కారణంగా తులా రాశివారికి అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారకి కార్యాలయంలో అనేక గొడవలు వస్తూ ఉంటాయి. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు చెడిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు వీరికి రుణభారం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో క్లిష్ట పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు జీవితంలో గందరగోళం ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది.
ధనుస్సు రాశి:
ఈ సంచార ధనుస్సు రాశివారికి కూడా చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టే ఛాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ మే నెలలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ రాశివారు అనవసర కేసుల్లో కూడా ఇరుక్కునే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు అదృష్టం కూడా సహకరించకపోవడం వల్ల విజయాలు సాధించకపోవచ్చు. అలాగే ఆస్తుల విషయాల్లో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మీన రాశి:
గురు గ్రహ సంచారంతో మీన రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. అలాగే వీరు కొన్ని అనవసరమైన ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయ. కాబట్టి వాకింగ్ చేయడం చాలా మంచిది. దీంతో పాటు తక్కువ అవగాహన కారణంగా ఇబ్బందులో పడొచ్చు. అలాగే ఖర్చులు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు స్నేహితుల కోపాన్ని బరించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి తీవ్ర నష్టాలు కూడా వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి