Dev deepawali 2022: దీపావళి తర్వాత 15 రోజుల తర్వాత దేవ్ దీపావళి జరుపుకుంటారు. ఈ ఏడాది దేవ్ దీపావళి నవంబర్ 07, 2022 న జరుపుకుంటారు. హిందూ గ్రంథాల ప్రకారం, దేవ్ దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి నవంబరు 8 తేదీన వచ్చింది. అయితే అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అందుకే ఈ సారి దేవ్ దీపావళిని (Dev deepawali 2022) పూర్ణిమకు ఒక రోజు ముందు అంటే నవంబరు 07న జరుపుకోనున్నారు. గ్రహణ సమయంలో పూజించడం నిషిద్ధంగా భావిస్తారు. ఈ ఏడాది దేవ్ దీపావళి తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
.దేవ్ దీపావళి 2022 శుభ ముహూర్తం
సాధారణంగా దేవ్ దీపావళిని కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 07 సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమ... నవంబర్ 08, 2022 సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 07, సోమవారం నాడు దేవ్ దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రదోష కాలంలో పూజకు అనుకూలమైన సమయం సాయంత్రం 5.14 నుండి 7.49 వరకు.
దేవ్ దీపావళి అంటే...
దేవ్ దీపావళి రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దీపాన్ని దానం చేయడం శ్రేయస్కరం. ఈ సంప్రదాయం ప్రకారం, బనారస్‌లోని గంగా నది ఒడ్డున పెద్ద ఎత్తున దీపాలను దానం చేస్తారు. బనారస్‌లో దీనిని దేవ్ దీపావళి అంటారు.
దేవ్ దీపావళి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, కార్తీక మాసం పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే ప్రజలు ఈ రోజును ఉత్సాహంగా దేవ్ దీపావళిని జరుపుకుంటారు. ఈ క్రమంలో ప్రజలు గంగా నది ఒడ్డున దీపాలను దానం చేస్తారు. దీనితో పాటు, ప్రజలు ఈ రోజున గంగా లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసిన తర్వాత దానం చేస్తారు. ఈ రోజు గంగా నది ఒడ్డున దీపాలు దానం చేయడం, స్నానం చేయడం శుభప్రదం.
Also Read: Chandra Grahan 2022: దేవ్ దీపావళి రోజునే చంద్రగ్రహణం, భారతదేశంపై దీని ప్రభావం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook