Budh Margi 2022: మార్గంలో బుధుడు.. వీరి డబ్బు సంచులు నిండటం ఖాయం..

Budh Margi 2022: గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2022, 11:55 AM IST
Budh Margi 2022: మార్గంలో బుధుడు.. వీరి డబ్బు సంచులు నిండటం ఖాయం..

Budh Margi Impact 2022: ప్రతి నెల కొన్ని గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచరించడం లేదా తిరోగమించడం చేస్తాయి. ప్రస్తుతం గ్రహాల యువరాజు బుధుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మార్గం (Budh Margi 2022) ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. దీపావళికి ముందు బుధుడు ఈ రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనున్నాడు. ఈ 15 రోజులు ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 

వృశ్చికరాశి(Scorpio): ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీంతో మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. సంపాదన పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. 

కన్యారాశి (Virgo): అక్టోబరు 2న బుధ గ్రహం ఈ రాశిలోనే సంచరించింది. దీంతో ఈరాశివారు భారీగా లాభపడనున్నారు. మెర్క్యూరీ శుభప్రభావం కారణంగా వీరి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 

కర్కాటకం (Cancer): ఈ రాశిచక్రం యొక్క మూడవ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంతో కర్కాటక రాశివారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు లాభిస్తుంది. ఈ కాలం మీకు కెరీర్ పరంగా కలిసి వస్తుంది.

మిథునం (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి యెుక్క లగ్నానికి అధిపతి బుధుడు. కన్యారాశిలో బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లి సపోర్టు ఉంటుంది. దీపావళి వరకు వ్యాపారవేత్తలకు ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు కొత్త కొత్త ఆర్డర్‌లు అందుకునే అవకాశం ఉంది. 

Also Read: Guru Vakri 2022: తిరోగమనంలో బృహస్పతి.. ఇక ఈ 4 రాశులకు తిరుగుండదు మరి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News