Young Man Drank King Cobra Blood: ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశస్తులు ఒక్కొక్క విధంగా విభిన్న సాంస్కృతి, సాంప్రదాయాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఆహార పద్ధతులు కూడా వేరేలా ఉంటాయి. ముఖ్యంగా చైనాలో చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ప్రజలు గబ్బిలాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో కుందేళ్ళతో వండిన బిర్యానిలు తింటారు. కానీ ఇండోనేషియాలో మాత్రం ఓ ప్రాంతంలో విష సర్పాలను ఆహారంగా తీసుకుంటారు. ప్రస్తుతం పెద్ద కింగ్ కోబ్రాను ఓ యువకుడు తింటున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇది తెగ ఆశ్చర్యపోతున్నారు.
వీడియో వివరాల్లోకి వెళితే.. మోస్ట్ డేంజరస్ పామ్ అయిన కింగ్ కోబ్రా ను ఓ వ్యక్తి పట్టుకొని తలకోయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ పాము తలకోసిన వ్యక్తి ఇంకో వ్యక్తికి పాము నుంచి వచ్చే రక్తాన్ని నోట్లో పోస్తున్న సన్నివేశాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది ఎంతో భయంకరమైన పామని తెలిసినప్పటికీ వారు అలా పట్టుకొని తలను కోసి దాని నుంచి వచ్చే రక్తాన్ని తాగడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే కింగ్ కోబ్రాలు అతి ప్రమాదకరమైన పాములు. ఇవి ఒక్కసారి కాటేస్తే మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
అంతేకాకుండా ఈ వీడియోలో మీరు గమనిస్తే.. పాము తలను కోసిన వ్యక్తి కోబ్రా పైనున్న చర్మాన్ని నెమ్మదిగా తీసేశాడు. అంతేకాకుండా ఆ పాము లోపల నుంచి ఓ చిన్న పేగును తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కనే ఉన్న ఓ యువకుడికి ఇచ్చాడు.. ఆ యువకుడు ఎంతో సులభంగా వాటిని నోట్లో వేసుకున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఇదేం తిండి రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అవర్ కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను ఒక మిలియన్ పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook