Viral Video today: చలికి గడ్డకట్టిన మహిళ జుట్టు.. ట్రెండింగ్ లో వీడియో..

Trending Video today: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో ఓ మహిళ జుట్టు చలికి గడ్డకట్టడం చూడవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 05:18 PM IST
Viral Video today: చలికి గడ్డకట్టిన మహిళ జుట్టు.. ట్రెండింగ్ లో వీడియో..

Viral Video today: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. సాధారణంగా చలికాలంలో ఉదయాన్నే బయటకు వెళ్లాలంటే చాలా మందికి ఇష్టముండదు. అలా బయటకు వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. మనం ఎముకలు కొరికే చలి గురించి వినే వింటాం. మరి వెంట్రుక‌ల్ని గ‌డ్డ‌కట్టించే  చలిని ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఈ వీడియో చూసేయండి. 

 స్వీడెన్‌(Sweden Weather)లో  మంచు విపరీతంగా కురుస్తోంది. అక్కడి ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి.  మైన‌స్ 30 డిగ్రీల సెల్సియ‌స్ వాతావ‌ర‌ణంతో ఆ దేశానికి చెందిన సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేసిన ఓ వీడియో అందరనీ షాక్ కు గురిచేసింది. ఎల్విరా లుండ్‌గ్రెన్ అనే మ‌హిళ జుట్టు ఎముకలు కొరికే చలికి గడ్డకట్టపోయింది. చలికి ఫ్రీజ్ అయిపోయిన కురులను వెన‌క్కి ముందుకు ఆడిస్తూ వెదర్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 'ఆర్కిటిక్ బ్లాస్ట్ వ‌ల్ల ప్ర‌స్తుతం యురోప్ అంతటా వెద‌ర్ శీత‌లంగా మారింది. బ‌య‌టి వాతావ‌ర‌ణం ఫ్రిజ్ త‌ర‌హాలో ఉంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elvira Lundgren (@exploring.human)

Also Read: Snake Funny Video: ఏమో అనుకుని డ్రాయర్‌ను ఎత్తుకెళ్లిన నాగుపాము..వీడియో చూస్తే నవ్వుకుంటారు..

 స్వీడెన్ లో బుధ‌వారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ చలికి 25 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. ఆ రోజున మైన‌స్ 43.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత నమోదు అయింది. 1999 తర్వాత ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారి. అక్కడ ఆ సంవత్సరంలో మైన‌స్ 49 డిగ్రీలు న‌మోదు అయ్యింది. 

Also Read: Bull enters SBI bank: ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి దూసుకొచ్చిన ఎద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News