Parrot Viral Video: ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించిన అందమైన చిలుక.. వీడియో వైరల్

Parrot Viral Video: పక్షుల్లో కెల్లా అందమైనవి చిలుకలు. అవి మనుషుల మాటలను అనుకరిస్తే ఎంతో మరెంతో అందంగా కనిపిస్తాయి. కానీ, ఓ చిలుక మాత్రం ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 04:55 PM IST
Parrot Viral Video: ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించిన అందమైన చిలుక.. వీడియో వైరల్

Parrot Viral Video: ప్రకృతిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. కానీ, చిలుకులు మాత్రం మానవులను అమాంతం ఆకర్షించేస్తుంటాయి. ఎందుకంటే చిలుకల్లో కొన్ని జాతుల పక్షులు మానవులను మాటలతో పాటు.. ఇతర శబ్దాలను పలుకగలవు. అందుకే చాలా మంది చిలుకలను కొని.. తమ ఇళ్లలో పెంచుకుంటుంటారు. సరదాగా వాటితో సమయాన్ని గడుపుతుంటారు. 

అలాంటి ఓ చిలుక ఐఫోన్ రింగ్ టోన్ కాపీ చేస్తూ.. దాని నోటి నుంచి పలుకుతుంది. ఆ చిలుక పలుకులు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యమేస్తోంది. ఐఫోన్ రింగ్ టోన్ ను వదలకుండా నోటితో ప్లే చేసేస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఐఫోన్ రింగ్ టోన్ ను ఎంతో కచ్చితంగా దాని కంఠంతో కూస్తుంది ఆ చిలుక. ఈ వీడియోను గూసి గౌడ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆ చిలుకకు సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేశారు. 

ఆ ఇన్ స్టాగ్రామ్ ఖాతా కేవలం ఆ చిలుక కోసమే వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆ ఖాతాను పూజా దేవరాజ్, హర్షిత్ నిర్వహిస్తున్నారు. సోమవారం (జనవరి 17) ఆ వీడియోను షేర్ చేయగా.. వెంటనే వైరల్ గా మారింది. 

ఈ వీడియోను చూసిన నెటిజన్లలో ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. "నేను ఇప్పటివరకు విన్న చిలుక పలుకలలో ఇదే అద్భుతం" ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఈ చిలుక ఐఫోన్ రింగ్ టోన్ వీడియోకు ఇప్పటి వరకు 802 లైకులను దక్కించుకుంది.  

Also Read: Snake Video: తలుపు మధ్యలో బుసలు కొడుతూ భయంకరమైన నాగుపాము...వీడియో వైరల్

Also Read: Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News