King Cobra Viral Video, King Cobra HalChal in Toilet: పాముల అన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది 'కింగ్ కోబ్రా'. ఇది విషపూరితమైనదే కాకుండా చాలా పొడవుగా ఉంటుంది. ఇలాంటి పాము మనుషులను కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి ప్రమాదకరమైన పాములు అడవుల్లో తిరుగుతుంటాయి. అప్పుడపుడు ఇళ్లలోకి కూడా వస్తుంటాయి. అయితే ఓ పాము ఏకంగా టాయిలెట్లోకి దూరింది. ఎంత ప్రయతించినా అందులోంచి రాలేదు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అయింది.
గుజరాత్‌లోని ఓ గ్రామంలోని ఇంట్లో ఉన్న టాయిలెట్లోకి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా దూరింది. ఆ ఇంటి యజమాని టాయిలెట్ కోసమని వెళ్లగా.. పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది. దాంతో యజమాని భయబ్రాంతులతో బయటికి పరుగెత్తుకొచ్చాడు. ఆపై ఇంటి యజమాని కాస్త ధైర్యం చేసి.. టాయిలెట్ డోర్ మూసేశాడు. ఆ వెంటనే స్నాక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఇంటికి వచ్చారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.